AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంతెనపై నుంచి నదిలో పడిపోయిన జీపు.. స్పాట్‌లోనే ఎనిమిది మంది మృతి!

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పిథోర్‌గఢ్‌లోని సుని వంతెనకు సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి నదిలో పడిపోయింది. ప్రమాదంలో సుమారు ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తోంది. కాగా వాహనం మువాని పట్టణం నుంచి బోక్తాకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో వాహనంలో 13 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

వంతెనపై నుంచి నదిలో పడిపోయిన జీపు.. స్పాట్‌లోనే ఎనిమిది మంది మృతి!
Uttarakhand
Anand T
|

Updated on: Jul 15, 2025 | 9:19 PM

Share

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం సుని వంతెన సమీపంలో అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రమాద సమయంలో వాహనంలో 13 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొంత మంది ప్రయాణికులతో మువాని పట్టణం నుంచి బోక్తాకు బయల్దేరిన ఓ వాహనం సుని వంతెనకు సమీపంలోకి రాగానే అదుపుతప్పి వంతెనసై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. వాహనం నదిలో పడే సమయంలో ప్రయణికులు కాపాడమని కేకలు వేసినట్టు కొన్ని నివేదికలు పేర్కొన్నారు.

వాహనం ప్రమాదానికి గురైన సమయంలో అందులో 13 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో 8 మంది చనిపోగా మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని ప్రాణాలతో రక్షించి హాస్పిటల్‌కు తరలించారు. అయితే మరణించిన వారితో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. చనిపోయిన వారంతా బోక్తాకు చెందిన వారుగా సమాచారం అందుతోంది.

ఇక ఈ ప్రమాదంపై రాష్ట్ర సీఎం ధామి స్పందించారు. 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ధామి ఆకాంక్షించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..