జమ్మూకశ్మీర్‌లోని 90 స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. యూనియన్ టెరిటరీలో ప్రారంభ ట్రెండ్స్‌లో 49 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ముందంజలో కొనసాగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పీడీపీ మూడు స్థానాల్లో, జేపీసీ మూడు స్థానాల్లో, స్వతంత్రులు తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జేకేపీసీకి చెందిన సజ్జన్ గని లోన్ ముందంజలో ఉన్నారు. హంద్వారా స్థానం నుంచి జేకేపీసీకి చెందిన ఇర్ఫాన్ సుల్తాన్ పండిట్‌పురి లాంగేట్ నుంచి పోటీ చేస్తున్నారు.