Earthquake: జమ్ముకశ్మీర్‌ను వణికిస్తున్న భూ ప్రకంపనలు.. 24 గంటల్లో 5 సార్లు కంపించిన భూమి..

|

Jun 18, 2023 | 9:28 AM

జమ్ముకశ్మీర్‌లో భూ ప్రకంపనలు నిరంతరంగా వస్తూనే ఉన్నాయి. గత 24 గంటల్లో జమ్ము-కశ్మీర్‌, లడఖ్‌లలో 5 సార్లు ప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం వణికిపోతున్నారు. వరుస భూ ప్రకంపనలు వస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

Earthquake: జమ్ముకశ్మీర్‌ను వణికిస్తున్న భూ ప్రకంపనలు.. 24 గంటల్లో 5 సార్లు కంపించిన భూమి..
Earthquake
Follow us on

Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ మరోసారి వణికిపోయింది. ఈ సారి బాంబుల మోతతో కాదు.. భూ ప్రకంపనలతో కదలిపోయింది. గత 24 గంటల్లో జమ్ము-కశ్మీర్, లడఖ్‌లో ఐదుసార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూ ప్రకంపనల తీవ్రత 4.5గా నమోదైంది. శనివారం (జూన్ 17) మధ్యాహ్నం 2:30 గంటలకు జమ్ము కశ్మీర్‌లో మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.0. శనివారం రాత్రి 9.44 గంటలకు లేహ్‌లో రెండవ ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత 4.5. ఇండో-చైనా సరిహద్దు సమీపంలోని జమ్ము కశ్మీర్‌లోని దోడా వద్ద రాత్రి 9.55 గంటలకు మూడో ప్రకంపనలు సంభవించగా, ఈ భూకంప తీవ్రత 4.4గా నమోదైంది.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున 2.16 గంటలకు ఈశాన్య లేహ్‌లో నాల్గవ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.1. అయితే భూ ప్రకంపనల తర్వాత ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారుల తెలిపారు. దీని తరువాత, జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో ఆదివారం తెల్లవారుజామున 3.50 గంటలకు ఐదవ, చివరి ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత మళ్లీ 4.1 గా నమోదైంది.

భారత వాతావరణ శాఖ అధికారి ప్రకారం, మధ్యాహ్నం 2 గంటలకు సంభవించిన భూకంపం కేంద్రం జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారితో పాటు కొండ రాంబన్ జిల్లాలో ఉంది. భూకంప తీవ్రత లోతు 33.31 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75.19 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉపరితలం నుండి ఐదు కిలోమీటర్ల దిగువన వచ్చినట్లుగా గుర్తించారు.

మరిన్ని జాతీయవార్తల కోసం