రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇకపై ట్రైన్స్‌లో సిగరెట్ తాగితే మూడేళ్ల జైలు, భారీ జరిమానా.!

|

Mar 24, 2021 | 4:20 PM

Indian Railways Key Decision: రైళ్లలో ఇటీవల కాలంలో జరుగుతోన్న అగ్ని ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది.

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇకపై ట్రైన్స్‌లో సిగరెట్ తాగితే మూడేళ్ల జైలు, భారీ జరిమానా.!
Follow us on

Indian Railways Key Decision: రైళ్లలో ఇటీవల కాలంలో జరుగుతోన్న అగ్ని ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ట్రైన్స్‌లో సిగరెట్లు, బీడీలు తాగినా, మండే వస్తువులను వెంట తీసుకొచ్చిన రూ. 1500 భారీ జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్షను విధించేందుకు సిద్దమైంది. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలకు కారణం సిగరెట్ లేదా బీడీ అని ప్రాధమిక నివేదికల్లో తేలింది. ఈ నేపధ్యంలోనే ఇకపై ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకునే విధంగా రైల్వేశాఖ ప్రణాళికలు రచిస్తోంది.

అగ్ని ప్రమాదాల నివారణపై వారం పాటు అవగాహనా కార్యక్రమం..

అగ్ని ప్రమాదాల నివారణపై ప్రయాణీకులు, ఉద్యోగుల్లో అవగాహనా కల్పించేందుకు ఏడు రోజుల పాటు అవగాహనా కార్యక్రమాలను ప్రారంభించాలని జోనల్ రైల్వేలకు రైల్వే శాఖ సూచనలు ఇచ్చింది.

ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మరో 12 రైళ్లను పునరుద్దరించేందుకు సిద్దమైంది. ఈ ట్రైన్స్‌లో పలు డైలీ మెయిల్ సర్వీసులు ఉండగా.. మరికొన్ని వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి.

ఏప్రిల్ 1నుంచి మొదలుకానున్న రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..

విజయవాడ–సాయినగర్‌ షిర్డి– విజయవాడ(మెయిల్ ఎక్స్‌ప్రెస్): 07207/07208

విజయవాడ–సికింద్రాబాద్‌–విజయవాడ(మెయిల్ ఎక్స్‌ప్రెస్) : 02799/02800

విశాఖపట్నం–సికింద్రాబాద్‌–విశాఖపట్నం(మెయిల్ ఎక్స్‌ప్రెస్) : 02739/02740

గుంటూరు –విశాఖపట్నం–గుంటూరు : 07239/07240

గూడూరు –విజయవాడ–గూడూరు(మెయిల్ ఎక్స్‌ప్రెస్) : 02734/02644

నర్సాపూర్‌–ధర్మవరం–నర్సాపూర్‌(మెయిల్ ఎక్స్‌ప్రెస్): 07247/ 07248

ఈ రైళ్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునరుద్దరించానున్నారు. వీటిని ప్రత్యేక రైళ్లుగా దక్షిణ మధ్య రైల్వే నడవనుంది. కాగా, ప్రస్తుతం రైల్వే శాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రత్యేక ట్రైన్స్‌గా నడుపుతుండగా.. ప్యాసింజర్ రైళ్లను మాత్రం ఇంకా పునరుద్దరించలేదు. రెగ్యులర్ రైళ్ల కోసం జనాలు ఇంకా ఎదురు చూపులు చూస్తున్నారు.

Also Read:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!

జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!

బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…