Indian Railways: రైలు సర్వీసుల విషయంలో వస్తోన్న వార్తలను ఖండించిన రైల్వే శాఖ.. అవి నిరాధారం అంటూ..

|

Mar 16, 2021 | 3:04 AM

Indian Railways Fact Check: కరోనా కారణంగా అన్ని రకాల ప్రయాణ సౌకర్యాలు రద్దయినట్లే రైల్వే శాఖ కూడా రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్‌ ప్రభావం తగ్గడంతో మళ్లీ సర్వీసులు పునరుద్దరించారు. ప్రస్తుతం..

Indian Railways: రైలు సర్వీసుల విషయంలో వస్తోన్న వార్తలను ఖండించిన రైల్వే శాఖ.. అవి నిరాధారం అంటూ..
Indian Railway
Follow us on

Indian Railways Fact Check: కరోనా కారణంగా అన్ని రకాల ప్రయాణ సౌకర్యాలు రద్దయినట్లే రైల్వే శాఖ కూడా రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్‌ ప్రభావం తగ్గడంతో మళ్లీ సర్వీసులు పునరుద్దరించారు. ప్రస్తుతం దాదాపు అన్ని మార్గాల్లో రైళు ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది.
ఈ నెల 31 వరకు రైలు సర్వీసులు రద్దు చేశారనేది సదరు వార్త సారంశం. ఈ వార్తకు సంబంధించిన కొన్ని క్లిప్‌లు నెట్టింట్లో బాగా సర్క్యూలేట్‌ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండని తేల్చి చెప్పింది. ఆ వార్తలు పూర్తి నిరాధారం అంటూ వివరణ ఇచ్చింది. ఇక సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ అవుతోన్న ఈ వీడియో క్లిప్‌లు గతేడాది వార్తల్లో వచ్చినవని పేర్కొంది. ఈ క్రమంలో కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) ఈ మేర‌కు ట్విట్టర్‌ వేదికగా ఫ్యాక్ట్ చెక్ పేరిట వివ‌ర‌ణ ఇచ్చింది. ఈ నెల 31వ తేదీ నుంచి రైలు స‌ర్వీసులు ర‌ద్దు చేశామ‌ని భార‌తీయ రైల్వేస్ ఏనాడు ప్ర‌క‌టించ‌లేద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం స్పెష‌ల్ రైళ్లుగా న‌డుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు, స‌బ‌ర్బ‌న్ రైళ్లు య‌ధావిధిగా కొన‌సాగుతాయ‌ని వివ‌రించింది. ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా కొవిడ్‌-19 నిబంధ‌న‌లు, మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని సూచించింది.

Also Read: పుట్టింటి నుంచి భార్యను పిలిచాడు.. ఆమె గొడవకు దిగింది.. వాదించలేక ఆ భర్త ఏం చేశాడంటే.!

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన ఉత్సవ కమిటీ

Turmeric Board: తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు.. పసుపు బోర్డు పెట్టే ఆలోచన లేదన్న కేంద్రం