Indian Railways: ఇక నుంచి రైలులో అవి కుదరవు.. కొత్త నిబంధనలు ఇప్పుడే తెలుసుకోండి..

|

Jan 22, 2022 | 9:14 AM

Indian Railways: ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు భారతీయ..

Indian Railways: ఇక నుంచి రైలులో అవి కుదరవు.. కొత్త నిబంధనలు ఇప్పుడే తెలుసుకోండి..
Follow us on

Indian Railways: ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు భారతీయ రైల్వే శాఖ కొత్త నిబంధనలను రూపొందించింది. ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు పాటలు పెట్టి పెద్ద పెద్ద సౌండ్ పెట్టడం, గట్టి గట్టిగా ఫోన్ మాట్లాడటాన్ని నిషేధించారు. ఒకవేళ ఎవరైనా పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ ప్లే చేసినా, గట్టి గట్టిగా ఫోన్‌లో మాట్లాడినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇవి మాత్రమేకాదు.. గుంపులుగా ప్రయాణించే ప్రయాణికులు అర్థరాత్రి వరకు మాట్లాడకూడదని స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల తర్వాత అన్ని లైట్లు ఆపేయాలనే కొత్త నిబంధనను కూడా తీసుకువచ్చింది. నిబంధనలను పాటించని ప్రయాణీకులపై రైల్వే చట్టం నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తారు.

ప్రయాణికుల అసౌకర్యం కలిగితే రైలు సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. కాగా, ఇలాంటి సమస్యలపై రైల్వే మంత్రిత్వ శాఖకు అనేక ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో అధికారులు ఈ కొత్త నిబంధనను తీసుకువచ్చారు. రైలులో ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా RPF, టికెట్ చెకర్స్, కోచ్ అటెండెంట్లు, క్యాటరింగ్‌తో సహా రైలు సిబ్బంది నిరంతర పర్యవేక్షన ఉంటుంది. ప్రయాణీకులు సరిగా ఉండేలా, ఇతరుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండేలా వీరు అలర్ట్ చేస్తుంటారు.

Also read:

Gopichand: మరోసారి విలనిజం చూపించబోతున్న గోపిచంద్.. మహేశ్‏ను ఢీకొట్టనున్న హీరో..

IPL 2022: లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఫిక్స్.. రిటైన్ లిస్టులో మరో ఇద్దరు ఎవరంటే?

Breast Cancer: పెరుగుతున్న రొమ్ము క్యాన్సన్‌ బాధితులు.. చికిత్స లేకుండానే నివారించవచ్చు..!