India Covid-19: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. ఒమిక్రాన్ బాధితులు ఎంతమంది ఉన్నారంటే..?

|

Dec 25, 2021 | 10:04 AM

India Corona Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు.. క్రమంగా తగ్గుముఖం పడుతున్న క్రమంలో కొత్త వేరియంట్ దడపుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య

India Covid-19: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. ఒమిక్రాన్ బాధితులు ఎంతమంది ఉన్నారంటే..?
India Corona Cases
Follow us on

India Corona Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు.. క్రమంగా తగ్గుముఖం పడుతున్న క్రమంలో కొత్త వేరియంట్ దడపుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భారత్‌లో ఇప్పటివరకు 415 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉంటే.. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

గడిచిన 24 గంటల్లో (శుక్రవారం) దేశవ్యాప్తంగా 7,189 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 387 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 77,032 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 578 రోజుల తర్వాత క్రీయాశీల కేసుల సంఖ్య ఈ గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.30 శాతానికిపైగా ఉంది.

Also Read:

YS Sharmila: మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్.. ఆ వ్యాఖ్యలు ఖండించాల్సేందేనంటూ..

Shampoo: షాంపూల్లో క్యాన్సర్‌ కారకాలు.. 30 ఉత్పత్తులను వెనక్కి తీసుకున్న కంపెనీ.. ఎక్కడంటే?