India Coronavirus: గుడ్ న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత 24 గంటల్లో (ఆదివారం) కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది.

India Coronavirus: గుడ్ న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
Coronavirus

Updated on: Aug 08, 2022 | 10:02 AM

India Covid Updates: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు.. దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత 24 గంటల్లో (ఆదివారం) కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశవ్యాప్తంగా నిన్న 16,866 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,50,877 (0.34 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 7.03 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.46 శాతం ఉంది.

దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా గణాంకాలు..

ఇవి కూడా చదవండి
  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,39,05,621 కి పెరిగింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,26,074 కి చేరింది.
  • నిన్న కరోనా నుంచి 18,148 మంది కోలుకున్నారు.
  • వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,32,28,670 కి చేరింది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 202.17 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • దేశంలో నిన్న 16,82,390 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us