Weather Report: ఈసారి వర్షాలు కుమ్మేశాయి.. దేశ వ్యాప్తంగా 42 జిల్లాల్లో 300 శాతం అధిక వర్షపాతం..!

|

Jul 16, 2022 | 7:44 PM

Weather Report: ఈ సారి నైరుతి రుతుపవాల కారణంగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Weather Report: ఈసారి వర్షాలు కుమ్మేశాయి.. దేశ వ్యాప్తంగా 42 జిల్లాల్లో 300 శాతం అధిక వర్షపాతం..!
Rains
Follow us on

Weather Report: ఈ సారి నైరుతి రుతుపవాల కారణంగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. గతం కంటే ఈ ఏడాది ఎక్కువగా వర్షాలు పడ్డాయంది. దేశ వ్యాప్తంగా 42 జిల్లాల్లో 300 శాతం అధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ వెల్లడించింది. జులై 7వ తేదీ నుంచి జులై 15 నాటికి సంబంధించిన వర్షపాతం వివరాలను ఐఎండీ వెల్లడించింది. కొన్ని కేంద్రాల్లో 1200 శాతం అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు వాతావరణ కేంద్రం అధికారులు.

ఐఎండీ వెల్లడించిన వివరాల ప్రకారం..

ఈ వారంలో దేశ వ్యాప్తంగా చూస్తే 50శాతం అధిక వర్షాలు నమోదు అయ్యాయి. ఈ వర్షాకాలంలో అతి భారీ వర్షాలు నమోదైన వారం ఇదేనని భారత వాతావరణ శాఖ తెలిపింది. జులై 7 నుంచి జులై 13వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. జూన్ 22తో ముగిసిన వారంలో 45శాతం అధిక వర్షపాతం నమోదైంది. జులై 6తో ముగిసిన వారంలో 28శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ప్రారంభమైన నాటినుంచి జులై 15నాటికి దేశంలో నమోదైన వర్షపాతం 93.5మిల్లీ మీటర్లు. జూన్ 28 నుంచి రుతు పవనాలు ప్రభావం తీవ్రం కాగా, అదే సమయంలో ఏర్పడిన అల్పపీడనాలు రుతుపవనాల తీవ్రతను పెంచాయని వెల్లడించింది ఐఎండీ. జులై 10 నుంచి తెలంగాణ, మహారాష్ట్రలో అధిక వర్షపాతం ప్రారంభమైంది. మధ్య భారతదేశంలో 137శాతం, మిగతా భారత ద్వీపకల్పంలో 155 అధిక వర్షపాతం నమోదైంది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు, సహా యూపీ, బీహార్ లో ఈ కాలంలో అల్ప వర్షపాతం నమోదైంది. ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కన్నా 66శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

ఇవి కూడా చదవండి

రాష్ట్రాల వారీగా అధిక, అల్ప వర్షపాతాల వివరాలు..

రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతంను మించి అతి భారీ వర్షపాతం నమోదైంది. వర్షానికి సంబంధించి సాధారణ స్థాయి, కురిసిన వర్షం, వర్షం నమోదైన శాతం(+ లేదా -) వంటి వివరాలు వరుసగా ఇప్పుడు తెలుసుకుందాం..

1. రాజస్థాన్ – 64మి.మీ(సాధారణ స్థాయి) – 126.2 మి.మీ(కురిసిన వర్షం) – 97 శాతం (+ లేదా -)
2. గుజరాత్ – 115.3మి.మీ – 370 మి.మీ – 221 శాతం
3. మహారాష్ట్ర – 151మి.మీ – 379.6మి.మీ – 151 శాతం
4. కర్నాటక – 116.2మి.మీ – 271.5మి.మీ – 134 శాతం
5. తెలంగాణ – 97మి.మీ – 387.మి.మీ – 297శాతం
6. అండమాన్ నికోబార్ దీవులు – 186.3మి.మీ – 313.7మి.మీ – 68శాతం

సాధారణ స్థాయిని మించి అధిక వర్షపాత నమోదైన రాష్ట్రాలు..

హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఉత్తరాఖండ్, మిజోరం, ఢిల్లీ..

1. హిమాచల్ ప్రదేశ్ – 110.4 మి.మీ – 143.6మి.మీ – 30శాతం
2. హర్యానా – 68.6మి.మీ – 85మి.మీ – 24శాతం
3. మధ్యప్రదేశ్ – 139.2మి.మీ – 210.8మి.మీ – 51శాతం
4. ఛత్తీస్ గఢ్ – 170.7మి.మీ – 264.1 మి.మీ – 55 శాతం
5. ఒడిశా – 148.1మి.మీ – 229.3మి.మీ – 55శాతం
6. ఆంధ్రప్రదేశ్ – 58.1మి.మీ – 83.5మి.మీ – 44శాతం
7. తమిళనాడు – 30.2మి.మీ – 40.6మి.మీ – 34శాతం
8. కేరళ – 324.7మి.మీ – 484.4మి.మీ – 49శాతం
9. పంజాబ్ – 73.9మి.మీ – 81.6మి.మీ – 10శాతం
10. ఉత్తరాఖండ్ – 187.9మి.మీ – 197.2మి.మీ – 5శాతం
11. మిజోరం – 199.7మి.మీ – 224.1మి.మీ – 12శాతం
12. ఢిల్లీ – 85మి.మీ – 97.6మి.మీ – 15శాతం

కురవాల్సిన వర్షం కంటే తక్కువ వర్షపాతం నమోదైన రాష్ట్రాలు..

ఉత్తర్ ప్రదేశ్ – 124.1 మి.మీ – 32.5 మి.మీ – -74శాతం
బీహార్ – 172.3మి.మీ – 22.4మి.మీ – -87శాతం
సిక్కిం – 233.9మి.మీ – 79.9మి.మీ – -66శాతం
అరుణాచల్ ప్రదేశ్ – 272.3మి.మీ – 102మి.మీ – -63శాతం
మేఘాలయ – 476.3మి.మీ – 101.1మి.మీ – -78శాతం
మణిపూర్ – 147.6మి.మీ – 47.9మి.మీ – -68శాతం
అస్సాం – 232.5మి.మీ – 98.8మి.మీ – -58శాతం
జార్ఖండ్ – 147.1మి.మీ – 76.6మి.మీ – -48శాతం
పశ్చిమబెంగాల్ – 195.3మి.మీ – 91.7మి.మీ – -53శాతం
జమ్ము&కశ్మీర్ – 76.2మి.మీ – 60.4మి.మీ – -21శాతం
త్రిపుర – 179.8మి.మీ – 77.3మి.మీ – -57శాతం

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..