Metro: రోడ్లపై పరుగులు పెట్టనున్న మెట్రో.. సరికొత్త ఆవిష్కరణలకు సిద్ధమవుతోన్న కేంద్ర ప్రభుత్వం

| Edited By: Ram Naramaneni

Apr 23, 2023 | 8:01 PM

ప్రస్తుతం ఇండియాలో ఫ్లైఓవర్‌పై పట్టాలపై పరిగెత్తే మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు నీటిపై కూడా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే మొట్టమొదటి వాటర్‌ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 25వ తేదీన ప్రారంభించనున్న విషయం తెలిసిందే...

Metro: రోడ్లపై పరుగులు పెట్టనున్న మెట్రో.. సరికొత్త ఆవిష్కరణలకు సిద్ధమవుతోన్న కేంద్ర ప్రభుత్వం
Representative Image
Follow us on

ప్రస్తుతం ఇండియాలో ఫ్లైఓవర్‌పై పట్టాలపై పరిగెత్తే మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు నీటిపై కూడా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే మొట్టమొదటి వాటర్‌ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 25వ తేదీన ప్రారంభించనున్న విషయం తెలిసిందే. కొచ్చిలో ప్రధాని వాటర్‌ మెట్రోను తొలిసారి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో ఆర్థికాభివృద్ధి, పర్యాటక రంగ అభివృద్ధి జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. నీటి వనరులు సమృద్ధిగా ఉన్న కొచ్చి లాంటి పట్టణాల్లో ఈ వాటర్‌ మెట్రో ఎంతగానో ఉపయోగపడనుంది. ఇదిలా ఉంటే దేశంలో రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే దిశగా కేంద్రం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రానున్న రోజుల్లో పలు రకాల మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇంతకీ ఆ మెట్రో సేవలు ఏంటంటే..

మెట్రో లైట్‌:

తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. సౌకర్యం, సౌలభ్యం, భద్రత, సమయపాలన విషయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంప్రదాయ మెట్రోతో ఎందులోనూ తీసిపోదు. ఈ మెట్రో ద్వారా టైర్‌2 సిటీస్‌తోపాటు, చిన్న నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించవచ్చు. సంప్రదాయం మెట్రోకు అయ్యే ఖర్చుతో పోల్చితే మెట్రో లైట్‌కు 40 శాతం తక్కువ ఖర్చు అవుతుంది. ఈ మెట్రో విధానాన్ని జమ్ము, శ్రీనగర్‌, గోరఖ్‌పూర్‌ వంటి నగరాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తు్న్నారు.

మెట్రో నియో:

మెట్రో నియో విధానంలో రైళ్లు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. మెట్రో నియో ఎలక్ట్రిక్‌ బస్‌ ట్రాలీని పోలి ఉంటుంది. దీంతో ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మెట్రో నియోకు గేజ్‌ ట్రాక్‌ అవసరం లేదు. మహారాష్ట్రతో పాటు నాసిక్‌లో మెట్రో నియోను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. సౌకర్యం, సౌలభ్యం, భద్రత, సమయపాలన విషయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంప్రదాయ మెట్రోతో ఎందులోనూ తీసిపోకుండా ఈ వ్యవస్థ ఉండనుంది.

రీజినల్‌ రాపిడ్‌ ట్రాస్టిక్‌ సిస్టమ్‌:

ఈ వ్యవస్థ ఇప్పటికే ప్రారంభమైంది. దేశంలో మెట్రో రైలు కంటే మెరుగైన ఇంటర్‌సిటీ మోడల్‌ రైల్వే వ్యవస్థగా ఆర్‌ఆర్‌టీఎస్‌ను ప్రస్తుతం ఢిల్లీ–మీరట్‌ మధ్య నిర్మిస్తున్నారు. దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాల మధ్య ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆధునిక కోచ్‌లు, మెరుగైన వసతులు, అత్యున్నత భద్రత వీటి సొంతం. ఢిల్లీ–మీరట్‌ మధ్య నిర్మాణం పూర్తయిన తర్వాత దశల వారీగా 7ఆర్‌ఆర్‌టీఎస్‌ల ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..