Gyanvapi Masjid Case: ముగిసిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణ.. తీర్పు ఎప్పుడుంటే..

|

May 23, 2022 | 4:01 PM

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారణాసి జిల్లా జడ్జి డాక్టర్‌ AK విశ్వేశ విచారణను చేపట్టారు. విచారణ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 19 మంది న్యాయవాదులు నలుగురు పిటిషనర్లను మాత్రమే కోర్టు గదిలోకి అనుమతించారు.

Gyanvapi Masjid Case: ముగిసిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణ.. తీర్పు ఎప్పుడుంటే..
Gyanvapi Mosque
Follow us on

జ్ఞానవాపి మసీదు కేసు(Gyanvapi Masjid) విచారణర్హతపై వారణాసి జిల్లా కోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై రేపు తీర్పు ఇస్తామని కోర్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారణాసి జిల్లా జడ్జి డాక్టర్‌ AK విశ్వేశ విచారణను చేపట్టారు. విచారణ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 19 మంది న్యాయవాదులు నలుగురు పిటిషనర్లను మాత్రమే కోర్టు గదిలోకి అనుమతించారు. మసీదు కమిటీ పిటిషన్‌పై విచారణ జరపాలా లేదా కమిషన్‌ నివేదికపై అభ్యంతరాలను ముందు వినాలా అనే విషయంలో వాదనలు జరిగాయి. దీనికి సంబంధించి కోర్టు ముందు అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో ఏది ముందు విచారణకు స్వీకరించాలనే దానిపై వారణాసి జిల్లా కోర్టు రేపు నిర్ణయాన్ని వెలువరించనుంది. కోర్టు గది లోపలకి కేవలం లక్ష్మి, సీతా సాహు, మంజు వ్యాస్, రేఖా పాఠక్, మహమ్మద్ తౌదీద్, అభయ్ యాదవ్, ముస్లిం తరపు న్యాయవాది, మేరాజ్ ఫరూఖీ, ముంతాజ్ అహ్మద్, హిందూ తరపు న్యాయవాది మదన్ మోహన్, రైస్ అహ్మద్, హిందూ పక్షం సుధీర్ త్రిపాఠి, సీనియర్ న్యాయవాది మన్ బహదూర్ సింగ్, విష్ణు జైన్, సుభాష్ చతుర్వేది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహేంద్ర ప్రసాద్ పాండే హాజరయ్యారు.

జిల్లా జడ్జి కోర్టులో జ్ఞానవాపి కేసు విచారణ ముగిసింది. ఇరుపక్షాల న్యాయవాదులతో సహా 23 మంది కోర్టు హాలులోకి అనుమతి ఇచ్చారు.  అయితే.. మాజీ కమిషనర్ అజయ్ మిశ్రాను కోర్టు లోపలికి అనుమతించలేదు. అజయ్ మిశ్రా మాత్రం తన నివేదికను కోర్టుకు సమర్పించారు. వకలట్నామాలో పేరు ఉన్న వారికే అనుమతించినట్లుగా కోర్టు ఉద్యోగులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదిలావుంటే.. కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్వాపి మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. అశ్విని ఉపాధ్యాయ్ తన పక్షం కూడా వినాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయం తన మత స్వేచ్ఛ హక్కుకు నేరుగా సంబంధించినదని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. శతాబ్దాలుగా ఆది విశేషేశ్వరుడు అక్కడ పూజలందుకుంటున్నాడు. ఈ ఆస్తి ఎప్పుడూ అతనిదే. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆస్తిపై వారి హక్కును హరించకూడదు. ఆలయంలోని కొన్ని భాగాలను కూల్చివేసి, ప్రార్థనలు కూడా చేయడం, జీవితం స్థాపించబడిన తర్వాత, నిమజ్జనం ప్రక్రియ ద్వారా విగ్రహాలను అక్కడి నుండి తరలించడం తప్ప, ఆలయ మతపరమైన స్వభావాన్ని మార్చదు. ఇస్లామిక్ సూత్రాల ప్రకారం కూడా ఆలయాన్ని కూల్చివేసి నిర్మించిన మసీదు చెల్లుబాటు అయ్యే మసీదు కాదని ఆమె తన పిటిషన్‌లో వాదించారు.