Gujarat, Himachal Pradesh Assembly Polls 2022 Result LIVE Streaming: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2022 ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. హిమాచల్‌లో ఒకే దశలో నవంబర్ 12న ఎన్నికలు జరగగా.. గుజరాత్‌లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. గుజరాత్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ డిసెంబర్ 1న జరగగా.. రెండవ దశ పోలింగ్ డిసెంబర్ 5న ముగిసింది. ఈ క్రమంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పార్టీల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. రేపు వెలువడే గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, గుజరాత్‌లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో ఆప్ ఉంటాయని పేర్కొన్నాయి. హిమాచల్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టిపోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ క్రమంలో గుజరాత్‌లో బీజేపీ మళ్లీ ప్రభంజనం సృష్టిస్తుందన్న ఊహగానాల మధ్య మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. సాయంత్రం నాటికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.
గుజరాత్‌లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాన్ని 27 సంవత్సరాలుగా పాలిస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా రాష్ట్రంలో అధికారం కోసం పోరాడుతోంది. ఈ క్రమంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. హిమాచల్‌లో గత సంప్రదాయం కొనసాగుతుందా..? లేక బీజేపీ మరోసారి బీజేపీ అధికారం సొంతం చేసుకుంటుందా..? లేక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తోపాటు ఆప్ కూడా గట్టిపోటీ ఇవ్వనుంది. ఈ క్రమంలో గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు, తాజా అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటూ టీవీ9 వెబ్‌సైట్‌ను వీక్షించండి.. అన్ని సమగ్ర వివరాలతో అందించనున్నాం..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదు కావడం.. జాతీయ పార్టీల్లో కలకలం రేపుతోంది. ఓటింగ్ పై సమీక్షించేందుకు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ (బిజెపి) గుజరాత్ యూనిట్ మంగళవారం సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా సునాయాసంగా విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నా.. దీనిపై పార్టీ సమగ్రంగా చర్చించింది. డిసెంబర్ 1 మరియు 5 తేదీల్లో రెండు దశల్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో 64.30 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఇది ప్రధాన పార్టీలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2017లో గుజరాత్‌లో జరిగిన రెండు దశల పోలింగ్‌లో మొత్తం 68 శాతం ఓటింగ్ నమోదైంది. అప్పటితో పోలిస్తే 4 శాతం తక్కువగ నమోదు కావడంపై ఆందోళన నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..