Gujarat Election 2022: ఈసీ కార్యాలయం ఎదుట ఆమ్ ఆద్మీ ధర్నా.. బీజేపీపై సంచలన ఆరోపణలు..

|

Nov 16, 2022 | 5:11 PM

గుజరాత్‌లో వచ్చే నెలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల వరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా సాగిన పోటీ ఈ ఎన్నికల్లో మాత్రం త్రిముఖంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేకంగా గుజరాత్‌పై..

Gujarat Election 2022: ఈసీ కార్యాలయం ఎదుట ఆమ్ ఆద్మీ ధర్నా.. బీజేపీపై సంచలన ఆరోపణలు..
AAP Leaders Dharna at Election Commission Office, Delhi
Follow us on

గుజరాత్‌లో వచ్చే నెలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల వరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా సాగిన పోటీ ఈ ఎన్నికల్లో మాత్రం త్రిముఖంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేకంగా గుజరాత్‌పై దృష్టిసారించడంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీపై ఆమ్‌ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. సూరత్‌ ఈస్ట్‌ నుంచి తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న కాంచన్‌ జరీవాలాను బీజేపీ కిడ్నాప్‌ చేసి.. బలవంతంగా నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా చేసిందని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపించింది. మంగళవారం కిడ్నాపైన కాంచన్‌ను 500 మంది పోలీసులు బలవంతంగా ఎన్నికల సంఘం కార్యాలయానికి తీసుకొచ్చి నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.

ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ధర్నా చేపట్టారు. భారత చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదని , ఎన్నికల సంఘం వెంటనే బీజేపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సీఎం భూపేంద్ర పటేల్‌ గట్‌లోడియా నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు రోడ్‌షోలో పాల్గొన్న తరువాత నామినేషన్‌ వేశారు భూపేంద్రపటేల్‌. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో గుజరాత్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో రోజూ పొలిటికల్ హీట్ రేపుతోంది. అయితే 27 ఏళ్లుగా గుజరాత్‌లో అధికారంలో ఉంటూ వస్తున్న బీజేపీ మరోసారి అధికారం చేజిక్కించుకుంటుందా.. కాంగ్రెస్‌కు అదృష్టం కలిసివస్తుందా.. ఆమ్‌ఆద్మీ పార్టీ సంచలనం సృష్టించనుందా అనేది మాత్రం మరో 22 రోజుల్లో తేలనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..