కేరళలో గూగుల్‌ మ్యాప్స్‌ ఫాలో అయిన హైదరాబాదీలు.. ఆ తర్వాత జరిగిందిదే..

| Edited By: Srikar T

May 25, 2024 | 7:02 PM

మనకి తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు పక్కాగా గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడాల్సిందే. మరో ఆప్షన్ లేదు. అయితే ఇలా మ్యాప్స్ ఫాలో అయ్యి కొందరు ఇబ్బందులకు గురైన ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా కేరళలోని కొట్టాయంలో అలాంటి ఘటనే జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఒక పర్యాటక బృందం గూగుల్‌ మ్యాప్స్‌ సహాయంతో అలప్పుళలోని బోటింగ్ ప్రాంతానికి వెళ్తున్నారు.

కేరళలో గూగుల్‌ మ్యాప్స్‌ ఫాలో అయిన హైదరాబాదీలు.. ఆ తర్వాత జరిగిందిదే..
Google Maps
Follow us on

మనకి తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు పక్కాగా గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడాల్సిందే. మరో ఆప్షన్ లేదు. అయితే ఇలా మ్యాప్స్ ఫాలో అయ్యి కొందరు ఇబ్బందులకు గురైన ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా కేరళలోని కొట్టాయంలో అలాంటి ఘటనే జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఒక పర్యాటక బృందం గూగుల్‌ మ్యాప్స్‌ సహాయంతో అలప్పుళలోని బోటింగ్ ప్రాంతానికి వెళ్తున్నారు. శనివారం తెల్లవారుజామున కురుప్పంతర ప్రాంతంలో వారి కారు ఓ కాలువ‌ వద్ద గల నీటి ప్రవాహంలో మునిగిపోయింది. కారు నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు.. పోలీస్‌ పెట్రోలింగ్‌ యూనిట్‌ సహాయంతో అందులోని పర్యటకులను సేవ్ చేశారు.

ఓ మహిళతో సహా నలుగురు సేఫ్‌గా బయటపడ్డారని, కారు నీటిలో మునిగిపోయిందని పోలీసులు వెల్లడించారు. వాహనాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు.. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా రహదారిపై చెరువు పొంగిపొర్లుతున్నందున ఆ నీటిలో మునిగిపోవడం, ఆ ప్రాంతం వారికి పరిచయం లేని కారణంగా, కారు నీటిలోకి వెళ్లిందని పోలీసులు తెలిపారు. గత ఏడాది అక్టోబరులో ఇద్దరు డాక్టర్స్ వర్షంలో మ్యాప్స్‌ను అనుసరిస్తూ వెళ్లి నదిలో మునిగి మరణించారు. ఈ ఘటన అనంతరం కేరళ పోలీసులు వర్షాకాలంలో టెక్నాలజీ ఉపయోగించే వారికి పలు హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…