జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. మృత్యువు ఎలాగైనా రావొచ్చు.. అందుకే.. ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేం.. అంచనా వేయలేం.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. పెళ్లైన 5 రోజులకే నవవధువు చనిపోయింది.. నవంబర్ 27, బుధవారం స్నానం చేయడానికి బాత్రూమ్‌కు వెళ్లిన నవ వధువు ఎంత సేపటికి తిరిగిరాలేదు.. అసలు ఏం జరిగిందో కూడా ఆమె కుటుంబ సభ్యులకు తెలియలేదు. చివరకు ఆమె విగత జీవిగా కనిపించింది.. గీజర్ పేలుడంతో ఆమె చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మహిళ స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌కు వెళ్లిందని, అయితే గీజర్ పగిలిపోవడంతో నవ వధువు ప్రాణాలు కోల్పోయిందని చెబుతున్నారు.
మృతురాలి పేరు దామిని అని, ఆమె భర్త పేరు దీపక్ యాదవ్ అని తెలిపారు. బరేలీలోని భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని పీపల్సనా చౌదరి గ్రామానికి చెందిన దీపక్, బులంద్‌షహర్ ప్రాంతానికి చెందిన దామినిని నవంబర్ 22న వివాహం చేసుకున్నారు. భర్త దీపక్ తెలిపిన వివరాల ప్రకారం.. దామిని ఎప్పటిలాగే స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌కు వెళ్లిందని, అయితే ఆమె చాలా సేపటికి బాత్‌రూమ్‌లో నుంచి బయటకు రాకపోవడంతో, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బాత్‌రూమ్ గేటు పగులగొట్టాల్సి వచ్చిందని తెలిపాడు.. దీని తర్వాత కుటుంబ సభ్యులు దామిని నేలపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూశారు.. ఈ సమయంలో గీజర్ నుంచి మంటలు వస్తూనే ఉన్నాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తర్వాత దామినిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.
అయితే.. ప్రస్తుతం చలికాలం.. చాలా మంది గీజర్‌ను ఉపయోగిస్తారు.. ఇలా సమయంలో.. గీజర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు 3 విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోండి.
ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు గీజర్‌ని ఉపయోగిస్తున్నారు.. అది బాత్రూంలో ఉంటుంది.. అయితే ఖాళీ స్థలం తక్కువగా ఉండటంతో గీజర్ స్విచ్ బోర్డుపై నీరు పడుతుందేమోనన్న భయం ఉన్నట్లయితే స్నానం చేసే ముందు గీజర్ బటన్ ఆఫ్ చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే స్నానం చేయాలని తెలుసుకోండి. లేకపోతే స్విచ్ బోర్డ్‌లో నీరు చేరడం వల్ల ఎలక్ట్రిక్ సర్క్యూట్ నుంచి పేలుడు సంభవించవచ్చు.
గీజర్ ఉపయోగిస్తున్నప్పుడు, దాని నుండి వింతగా ఏదైనా శబ్దం వస్తే వెంటనే దానిని ఆఫ్ చేయండి. సాధారణం గీజర్ ఉపయోగిస్తే శబ్దం రాదు.. ఇలాంటి సమయంలో వేరే ఏదైనా శబ్దం వస్తే.. గీజర్‌లో ఏదైనా లోపం సంకేతం కావచ్చు. ఇది గీజర్ విస్ఫోటనం చెందడానికి కూడా కారణం కావచ్చు. అందువల్ల, మీకు గీజర్‌లో ఏదైనా లోపం అనిపించినప్పుడల్లా లేదా ధ్వనిలో ఏదైనా ఆటంకం ఏర్పడినప్పుడల్లా వెంటనే ఆఫ్ చేసి, ఎలక్ట్రీషియన్‌తో తనిఖీ చేయించండి..
సాధారణంగా గీజర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ప్రజలు ఈ పొరపాటు చేస్తారు. గీజర్‌ను రోజంతా రన్ చేయడం లేదా స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోవడం సరికాదు. గీజర్‌ని ఎక్కువసేపు ఆన్‌లో ఉంచడం వల్ల గీజర్ పనిచేయకపోవచ్చు. అధిక వేడి చేయడం కూడా గీజర్ బ్లాస్ట్‌కు దారి తీస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..