Crime News: వివాహ వేడుకలో విషాదం.. అగ్నికి ఆహుతైన ఐదుగురు కుటుంబసభ్యులు.. మరో ఏడుగురు..

|

Aug 26, 2022 | 9:30 AM

ఈ అగ్నిప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారని మొరాదాబాద్‌ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు

Crime News: వివాహ వేడుకలో విషాదం.. అగ్నికి ఆహుతైన ఐదుగురు కుటుంబసభ్యులు.. మరో ఏడుగురు..
Moradabad Fire Accident
Follow us on

Moradabad fire accident: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో పెళ్లింట విషాదం నెలకొంది. మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఐదుగురు అగ్నికి ఆహుతయ్యారు. మరికొంతమంది తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారని మొరాదాబాద్‌ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అందుపులోకి తీసుకొచ్చాయి.

మూడు అంతస్థుల్లో కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు నివసిస్తున్నారు. వారంతా పెళ్లి వేడుకలో నిమగ్నమయ్యారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు స్పందించి ఏడుగురిని కాపాడారని.. మరో ఐదుగురు చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ కారణాలను తెలుసుకోవడానికి తదుపరి విచారణను నిర్వహిస్తోందని మొరాదాబాద్ శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. కాగా.. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే మంట‌లు చెల‌రేగిన‌ట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..