Open air floating theatre: సరస్సు మధ్యలో ఓపెన్‌ ఎయిర్‌ ఫ్లోటింగ్‌ థియేటర్‌.. ఎక్కడంటే..

|

Nov 05, 2021 | 9:28 AM

జమ్మూ కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సుపై ఏర్పాటు చేసిన ఓపెన్‌ ఎయిర్‌ ఫ్లోటింగ్‌(తేలియాడే) థియేటర్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం

Open air floating theatre: సరస్సు మధ్యలో ఓపెన్‌ ఎయిర్‌ ఫ్లోటింగ్‌ థియేటర్‌.. ఎక్కడంటే..
Follow us on

జమ్మూ కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సుపై ఏర్పాటు చేసిన ఓపెన్‌ ఎయిర్‌ ఫ్లోటింగ్‌(తేలియాడే) థియేటర్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం శ్రీనగర్‌ స్మార్ట్‌ సిటీ, జమ్మూ కశ్మీర్ యూత్‌ మిషన్‌తో కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దాల్ సరస్సును సందర్శించేందుకు హౌస్‌బోట్లలో వచ్చిన పర్యాటకులు సరస్సు మధ్యలోనుంచి స్ర్కీన్‌పై సినిమాలను చూసే సౌలభ్యం కల్పించింది. ఐకానిక్‌ వేడుకలను పురస్కరించుకుని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ మెహతా ఈ ఫ్లోటింగ్‌ థియేటర్‌ను ప్రారంభించారు.

మొదటి సినిమా అదే..
సరస్సు మధ్యలో హౌస్‌బోట్లలో కూర్చొని పెద్ద తెరపై సినిమా చూడడం సినిమా ప్రేమికులకు సరికొత్త అనుభూతినిస్తుందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రారంభోత్సవంలో భాగంగా టూరిస్టులు, స్థానిక కళాకారుల కోసం ‘కశ్మీర్ కి కలి’ అనే బాలీవుడ్ సినిమాను థియేటర్‌పై ప్రదర్శించారు. షమ్మీకపూర్‌, షర్మిలా ఠాగూర్‌, ప్రాణ్‌ వంటి దిగ్గజ స్టార్లు నటించిన ఈ సినిమా 1964లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే షర్మిలా వెండితెరపైకి అడుగుపెట్టడం విశేషం. శక్తి సమంతా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎక్కువ భాగాన్ని కశ్మీర్‌లోనే చిత్రీకరించారు.

Also Read:

Hooch Tragedy: కాటేసిన కల్తీ మద్యం.. బీహార్‌లో 24 మంది మృత్యువాత.. మరికొంత మంది పరిస్థితి..

Neem Tree: వేప చెట్లకు అంతుచిక్కని వింత వ్యాధి..! ఉన్నట్టుండి ఎండిపోతున్న వేపచెట్లు.. (వీడియో)

Bribe Case: యూనిఫాం తీసేసి ఎస్‌ఐ పరుగో పరుగు.. ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు.. అసలేమైందంటే..?