దేశంలోనే మొట్ట మొదటిసారిగా మహిళా బస్ డిపో ప్రారంభం.. ఎక్కడంటే..

|

Nov 18, 2024 | 10:25 AM

వీరిలో 89 మంది డ్రైవర్లు, 134 మంది కండక్టర్లు ఉన్నారని చెప్పారు. అయితే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలో కూడా తమ హక్కులను పొందాలనే ఆలోచనతోనే ఈ డిపోను ప్రారంభించామని రవాణా శాఖ మంత్రి తెలిపారు.

దేశంలోనే మొట్ట మొదటిసారిగా మహిళా బస్ డిపో ప్రారంభం.. ఎక్కడంటే..
indias first womens bus depot
Follow us on

దేశంలోనే తొలిసారిగా అందరూ మహిళలే పనిచేసే బస్‌ డిపో ఢిల్లీలో ప్రారంభమైంది. ఢిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాశ్‌ గెహ్లాట్‌ దీన్ని ప్రారంభించారు. సరోజిని నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తిస్థాయిలో మహిళ సిబ్బంది పనిచేయనున్నారు. ఈ డిపోకు సఖి డిపో అనే పేరు కూడా పెట్టారు. డిపో మెనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది అందరూ కూడా మహిళలే. ఇందుకోసం మొత్తం 225 మంది సిబ్బందిని కేటాయించామని పేర్కొన్నారు. వీరిలో 89 మంది డ్రైవర్లు, 134 మంది కండక్టర్లు ఉన్నారని చెప్పారు. అయితే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలో కూడా తమ హక్కులను పొందాలనే ఆలోచనతోనే ఈ డిపోను ప్రారంభించామని మంత్రి కైలాశ్‌ గెహ్లాట్‌ తెలిపారు.

ఇకపోతే, సరోజినీ నగర్ డిపోకు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంది.. అదేంటంటే.. గతంలో సరోజినీ నగర్ డిపోగా పిలువబడే సఖి డిపో ఢిల్లీ రవాణా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఏప్రిల్ 1954లో ప్రారంభించబడిన సఖి బస్‌ డిపో..ఢిల్లీలోనే మొట్టమొదటి బస్ డిపో. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు పేరు మీదుగా పేరుపొందిన ఈ డిపో ప్రగతికి, సాధికారతకు దీటుగా నిలుస్తోంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఏప్రిల్ 10, 2015న డిటిసిలో చేరిన ఢిల్లీ తొలి మహిళా బస్సు డ్రైవర్ వంకదావత్ సరిత కూడా సరోజినీ నగర్ డిపోలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె ఇప్పుడు కూడా విధుల్లో ఉన్నారు. ఢిల్లీ అంతటా మరిన్ని మహిళా డిపోలను అందుబాటులోకి తెచ్చేలా విశాల దృక్పథంలో సఖి డిపో మొదటి అడుగు అంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..