Cyber Crime: కోటి రూపాయలు జమచేయాలని మెసెజ్.. బ్లైండ్ గా డిపాజిట్.. సీన్ కట్ చేస్తే..

|

Sep 11, 2022 | 9:21 AM

ఆర్థిక నేరగాళ్లు రోజురోజుకు కొత్త దారులు వెతుకుతున్నారు. సైబర్ నేరగాళ్లపై పోలీసులు ఫోకస్ పెట్టినా.. వారి మోసాలు ఆగడం లేదు. మోసపోయే వాళ్లుంటే.. మోసం చేయడం పెద్ద కష్టమేమి కాదని కూడా అంటారు. ఇది నిజమే.. సాధారణంగా ఎవరైనా భారీ మొత్తంలో అమౌంట్ డిపాజిట్..

Cyber Crime: కోటి రూపాయలు జమచేయాలని మెసెజ్.. బ్లైండ్ గా డిపాజిట్.. సీన్ కట్ చేస్తే..
Aadar Poonawalaa
Follow us on

Adar Poonawalla: ఆర్థిక నేరగాళ్లు రోజురోజుకు కొత్త దారులు వెతుకుతున్నారు. సైబర్ నేరగాళ్లపై పోలీసులు ఫోకస్ పెట్టినా.. వారి మోసాలు ఆగడం లేదు. మోసపోయే వాళ్లుంటే.. మోసం చేయడం పెద్ద కష్టమేమి కాదని కూడా అంటారు. ఇది నిజమే.. సాధారణంగా ఎవరైనా భారీ మొత్తంలో అమౌంట్ డిపాజిట్ చేయాలని అకౌంట్ నెంబర్లు మెసెజ్ పెడితే.. ఓసారి డబ్బులు అడిగిన వ్యక్తి నుంచి కన్ఫర్మేషన్ తీసుకుంటాం. కాని కోటి రూపాయలు డిపాజిట్ చేయాలంటూ కొన్ని అకౌంట్ నెంబర్లు వాట్సప్ మెసేజ్ చేశారు సైబర్ నేరగాళ్లేఉ. అంతే వెంటనే కోటి రూపాయలకు పైగా అకౌంట్ లో వేసేశారు. తీరా డిపాజిట్ చేశాక తెలిసింది. తాము మోసపోయామని.. ఇంతకీ సైబర్ నేరగాళ్లు ఎవరిని టార్గెట్ చేసి రూ.కోటి రూపాయలు మోసానికి పాల్పడ్డారో తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే. కోవిషీల్డ్ వ్యాక్సిన్ పేరు చెప్తే మనకు గుర్తొచ్చేది సీరం ఇనిస్టిట్యూట్. వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా పేరు చెప్పి సైబర్‌ నేరగాళ్లు రూ.కోటికి పైగా మోసానికి పాల్పడ్డారు. వెంటనే డబ్బు బదిలీ చేయాలంటూ పూనావాలా పేరిట సీరం సంస్థ డైరెక్టర్‌ సతీశ్‌ దేశ్‌పాండేకు సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్‌ పంపించారు. కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను వాట్సాప్‌ చేశారు. దీంతో కంపెనీ సిబ్బంది ఆ ఖాతాల్లోకి రూ.1,01,01,554 బదిలీ చేశారు.

డబ్బంతా పంపిచాక తెలిసింది ఆ మెసేజ్‌ పూనావాలా పంపలేదని, దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న తర్వాత సీరం సంస్థ సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పుణే పోలీసులు చీటింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సీరం కంపెనీ కరోనా టీకా కోవిషీల్డ్‌తో సహా ఇతర వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..