హర్యానాలో మొదట్లో కాంగ్రెస్‌కి ఆశాజనకంగా కనిపించిన కొన్ని గంటల్లోనే మలుపు తిరిగింది. కౌంటింగ్ మొదటి రౌండ్లలో కాంగ్రెస్‌ను ముందంజలో కొనసాగింది. అయితే అనూహ్యంగా బీజేపీ లీడింగ్ వచ్చింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హర్యానాలో ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం బీజేపీ 48 స్థానంలో, కాంగ్రెస్ 37 స్థానంలో ఆధిక్యంలో ఉంది.
హర్యానాలో పదేళ్ల తర్వాత పీఠం ఎక్కాలని కాంగ్రెస్ ఎంతోగాను భావించింది. కాంగ్రెస్ ప్రస్తుతం జులానా, నుహ్‌తో సహా 28 స్థానాలను గెలుచుకుంది. లద్వా, ఫరీదాబాద్ సహా 29 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. హర్యానాతో పాటు జమ్మూకశ్మీర్‌లోనూ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 2014 తర్వాత J&Kలో జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇది. ఇక్కడ NC-కాంగ్రెస్ కూటమి సమిష్టిగా 47కి సగం మార్కును దాటింది.
కాగా ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది. దీంతో ఫలితం తమకు అనుకూలంగా వస్తుందని కాంగ్రెస్ నాయకులు భావించారు కౌంటింగ్ మొదట్లో కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్‌లో ఉండడంతో ఆ పార్టీ నాయకులు ముందస్తు సంబరాలు కూడా చేసుకున్నారు. హర్యానాలో ఓటర్లు బీజేపీకి మరోసారి పట్టం కట్టారు. ఇటీవలే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి హిందీ హార్ట్‌ల్యాండ్ అయిన ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో హర్యానాలో బీజేపీకి ఓటమి తప్పదని అందరూ భావించారు. కానీ బీజేపీ హర్యానా అసెంబ్లీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని ఫ్యూహాలు రచించింది.
జమ్మూకశ్మిర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమరయ్యాయి. ముఖ్యంగా హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి పక్కా వస్తుందని, జమ్మూకశ్మిర్‌లో హంగ్ ఏర్పాడుతుందని 90 శాతం ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. హర్యానాలో బీజేపీ అధికారం దిశగా అధిక్యం కొనసాగుతుంది. జమ్మూకశ్మిర్‌లో కాంగ్రెస్ ఎన్‌సీ కూటామి అధిక్యత కనబరుస్తుంది.