AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్ నినో ఎఫెక్ట్.. సముద్రంలో ఆహారం కొరత.. ఆ చేపల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం..

ఎల్ నినో ప్రభావం కేవలం వర్షాభావానికే పరిమితం కాకుండా సముద్ర జీవవ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడంతో సార్డిన్ చేపల గుడ్లు దెబ్బతినడం, పిల్ల చేపలు మనుగడ సాగించలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMFRI) వెల్లడించింది.

ఎల్ నినో ఎఫెక్ట్.. సముద్రంలో ఆహారం కొరత.. ఆ చేపల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం..
Fish
Shaik Madar Saheb
|

Updated on: Jul 13, 2026 | 12:53 PM

Share

ఎల్ నినో ప్రభావంతో దాదాపు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.. చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి.. వర్షాలు ఆశించినంతంగా కురవకపోవడం వల్ల పంటల దిగుబడి తగ్గడంతోపాటు.. ఆహారం కొరత ఏర్పడే అవకాశం ఉంది.. దీంతోపాటు ఎల్ నీనో అనేక విషయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్ నీనో పరిస్థితుల వల్ల చేపల లభ్యత కూడా తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా సముద్రంలో లభించే సార్డిన్‌ల లభ్యత తగ్గుతుందన్న వార్తలు ఆందోళనలను రేకెత్తించాయి. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMFRI) ఈ హెచ్చరికను జారీ చేసింది. సముద్రంలో వడగాలులను సృష్టించే ఎల్ నినో.. బలపడటంతో చేపల లభ్యత తగ్గుతుందని అది హెచ్చరించింది. ఎల్ నినో వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యే చేపలలో సార్డిన్‌ (కవళ్ళు లేదా కవ్వలు) లు కూడా ఒకటిగా ఉంటాయని CMFRI నివేదిక సూచిస్తోంది.

సముద్రంలోని తీవ్రమైన వేడి, కేరళ, ఏపీ తీరంలో అత్యధికంగా లభించే ఆయిల్ సార్డిన్ వంటి చిన్న చేపలను ప్రభావితం చేస్తుంది. CMFRI శాస్త్రవేత్తలు అందించిన నివేదికల ప్రకారం, వేడి వాతావరణంలో సార్డిన్‌లు పునరుత్పత్తి సమస్యలతో బాధపడటం, వాటి గుడ్లు నశించపోవడం లేదా దెబ్బతినడం సర్వసాధారణం. సార్డిన్‌లు సాధారణంగా మే-జూన్ నెలల్లో గుడ్లు పెడతాయి. ఎల్ నినో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతను క్రమంగా పెంచుతున్నందున, సార్డిన్ గుడ్లు పొదిగి లార్వాలుగా మారే ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. దీని ఫలితంగా, గుడ్లు దెబ్బతినడంతోపాటు.. ఒకవేళ ఉత్పత్తి అయిన కవ్వళ్ల పిల్ల చేపలు వేడిని తట్టుకోలేక చనిపోతాయి.

సముద్రంలో ఆహార కొరత

దీనికి తోడు, హెర్రింగ్ చేపల ప్రధాన ఆహారమైన సముద్రపు నాచు నాశనమవుతోంది. ఎల్ నినో కారణంగా, సముద్రపు అడుగుభాగం నుండి పోషకాలు అధికంగా ఉన్న నీరు పర్వతంలా పైకి వచ్చే పరిస్థితి బలహీనపడింది. ఈ సహజ ప్రక్రియను అప్‌వెల్లింగ్ అంటారు. దీనితో, సముద్రపు నాచు రాక బాగా తగ్గిపోయింది. హెర్రింగ్ (సముద్రంలో భారీ గుంపులుగా ప్రయాణించే చిన్న, వెండి రంగు చేప) చేపలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ ఆహార కొరత ఏర్పడి, సంతానోత్పత్తికి అనువైన వాతావరణం కనుమరుగవడంతో, హెర్రింగ్‌లతో సహా సార్డినెస్ అలాగే ఇతర చేపలు చల్లని సముద్రాలకు తరలివెళ్లడం ప్రారంభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

నేటి ఎల్ నినో – రేపటి చేపల కొరత

ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఎల్ నినో ప్రభావం.. వచ్చే ఏడాది (2027) ఏప్రిల్, మే నెలల నాటికి కనబడతాయని వాతావరణ శాఖ అలాగే.. ఆహార నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త చేపల ఉత్పత్తి లేకపోవడం వల్ల వచ్చే ఏడాది నాటికి సముద్రంలో తీవ్రమైన చేపల కొరత ఏర్పడే అవకాశం ఉందని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMFRI) చెబుతోంది.

వీటన్నిటితో పాటు, పగడపు దిబ్బల విధ్వంసం వల్ల కలిగే పరిణామాలు కూడా ఉన్నాయి. చెంపల్లి (రెడ్ స్నాపర్) వంటి చేపలు తమ మనుగడ కోసం పగడపు దిబ్బలపై ఆధారపడి ఉంటాయి. లక్షద్వీప్ వంటి ద్వీపసమూహాలలో దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. ఎందుకంటే పగడపు దిబ్బల విధ్వంసం భూమి క్షీణతకు కూడా దారితీయవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..
జెన్ జీ యువతపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
జెన్ జీ యువతపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
40 ఏళ్లలోపే మెనోపాజ్.. అమ్మాయిలు కాస్త జాగ్రత్త! ఇవి తెలుసుకోండి
40 ఏళ్లలోపే మెనోపాజ్.. అమ్మాయిలు కాస్త జాగ్రత్త! ఇవి తెలుసుకోండి
వర్షాల కోసం సింహాచలంలో వరుణ జప యాగం..
వర్షాల కోసం సింహాచలంలో వరుణ జప యాగం..
ఈ ఒక్కలోపం ఉంటే ఎన్ని షాంపూలు వాడిన జుట్టు రాలుతూనే ఉంటుంది!
ఈ ఒక్కలోపం ఉంటే ఎన్ని షాంపూలు వాడిన జుట్టు రాలుతూనే ఉంటుంది!
డోర్‌మ్యాట్ నల్లగా మారి దుర్వాసన వస్తోందా?.. సింపుల్ హ్యాక్
డోర్‌మ్యాట్ నల్లగా మారి దుర్వాసన వస్తోందా?.. సింపుల్ హ్యాక్
వెంటనే బరువు తగ్గాలా?.. ఇవి తింటే కొవ్వు దానికదే మాయం!
వెంటనే బరువు తగ్గాలా?.. ఇవి తింటే కొవ్వు దానికదే మాయం!
వర్షంలో వేడి వేడిగా ఈ కరకరలాడే మష్రూమ్ పకోడీ ఉంటే చాలు..
వర్షంలో వేడి వేడిగా ఈ కరకరలాడే మష్రూమ్ పకోడీ ఉంటే చాలు..
అమెరికా వెళ్లి 500 ఎకరాల్లో కొబ్బరి తోట సాగు చేస్తున్న భారతీయుడు!
అమెరికా వెళ్లి 500 ఎకరాల్లో కొబ్బరి తోట సాగు చేస్తున్న భారతీయుడు!
NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే
NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే