AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. మూడు కోడిగుడ్ల ధర పదహారు వందలా..?

సోషల్ మీడియా వచ్చాక.. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత ఘటన జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఇది దీనికున్న పవర్. ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే.. ఈ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే.. క్షణాల్లో వైరల్‌గా మారుతున్న ఘటనలు అనేకం. ముఖ్యంగా మన దేశంలో అయితే ఎక్కడైనా ధరలు పెరిగినా.. అక్రమంగా అధిక ధరలు వసూలు చేసినా.. ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పరిపాటిగా మారింది. గతంలో రెండు అరటి పండ్లకు వందల్లో బిల్లు వేసిన […]

వామ్మో.. మూడు కోడిగుడ్ల ధర పదహారు వందలా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 16, 2019 | 7:11 AM

Share

సోషల్ మీడియా వచ్చాక.. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత ఘటన జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఇది దీనికున్న పవర్. ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే.. ఈ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే.. క్షణాల్లో వైరల్‌గా మారుతున్న ఘటనలు అనేకం. ముఖ్యంగా మన దేశంలో అయితే ఎక్కడైనా ధరలు పెరిగినా.. అక్రమంగా అధిక ధరలు వసూలు చేసినా.. ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పరిపాటిగా మారింది.

గతంలో రెండు అరటి పండ్లకు వందల్లో బిల్లు వేసిన ఘటనను చూశాం. అయితే ఇప్పుడు అలాంటి కోవలోకి ఓ స్టార్ హోటల్ వచ్చిపడింది. ఈ హోటల్‌ స్పెషాలిటీ ఎంటో తెలిస్తే షాక్ తింటారు. మీరు కలలో కూడా ఊహించని ధరలు ఇక్కడ ఉంటాయి. అది కూడా కొడిగుడ్డు ధర. సామాన్యంగా గుడ్డు ధర మహా అయితే రూ.5 ఉంటుంది. ఒకవేళ ధరలు పెరిగితే.. రూ.7 మొత్తానికి పదిరూపాయలలోపే ఉంటుంది. ఇక ఇది గుడ్డును హోటల్స్, రెస్టారెంట్స్‌లలో ఉడకబెట్టి అమ్మితే రూ.20 నుంచి 30 ఉంటుంది. అది కూడా పెద్ద పెద్ద వాటిల్లో అయితేనే.. లేదంటే పదిహేను రూపాయలలోపే వస్తుంది. అయితే గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో మాత్రం గుడ్ల ధరలను చూస్తే.. ఉలిక్కిపడతారు. మూడు కోడిగుడ్లకు వేలల్లో బిల్లు వేసింది ఈ హోటల్.

వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ సంగీత దర్శకుడు శేఖర్‌ రావ్‌జియాని.. గురువారం హయత్‌ రీజెన్సీ స్టార్‌ హోటల్‌లో మూడు ఉడకబెట్టిన కోడిగుడ్లతో భోజనం ఆర్డర్‌ ఇచ్చారు. అయితే భోజనం చేసిన తర్వాత వచ్చిన బిల్లు చూసి ఆయన ఒక్కసారిగా షాక్‌‌కు గురయ్యారు. మూడు కోడిగుడ్ల ధర ఏకంగా రూ.1672లుగా ఉంది. అది కూడా జీఎస్టీతో కలిపి అని ఉంది. అయితే ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ బిల్లులో మూడు ఉడికించిన కోడిగుడ్లకు గాను రూ.1350, సర్వీస్‌ ఛార్జీగా రూ.67, సీజీఎస్టీ రూ.127, ఎస్‌జీఎస్టీ 127.. మొత్తం బిల్లు రూ.1672లుగా ఉంది. ఆ బిల్లుకు సంబంధించిన ఫోటోను శేఖర్ ట్విట్‌ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

Follow Us
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య
ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!
ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!
ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా..
ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా..
వైభవ్ వైఫల్యంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
వైభవ్ వైఫల్యంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
ఆ హీరోతో 40 సినిమాలు చేశా.. పుట్టిన రోజున బంగారు గాజు ఇచ్చారు
ఆ హీరోతో 40 సినిమాలు చేశా.. పుట్టిన రోజున బంగారు గాజు ఇచ్చారు
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? చియా సీడ్స్ తినడానికి సరైన సమయం
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? చియా సీడ్స్ తినడానికి సరైన సమయం
స్టేజ్‌పైనే ఏడ్చేసిన రావు బహదూర్ హీరోయిన్
స్టేజ్‌పైనే ఏడ్చేసిన రావు బహదూర్ హీరోయిన్
చిరుతకే చెమటలు పట్టించిన జింకపిల్ల.. కొండల మధ్య వేటాడే సీన్
చిరుతకే చెమటలు పట్టించిన జింకపిల్ల.. కొండల మధ్య వేటాడే సీన్
అనారోగ్య సమస్యలతో పత్యం చేసేవాళ్ళు తినగలిగే పేదింటి కారం పొడి..
అనారోగ్య సమస్యలతో పత్యం చేసేవాళ్ళు తినగలిగే పేదింటి కారం పొడి..
బంగారు అభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు
బంగారు అభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు