Earthquake Assam-Jharkhand: జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు..

|

Oct 03, 2021 | 4:04 PM

Earthquake Assam-Jharkhand: అస్సాం, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆదివారం భూకంపం సంభవించింది. తొలుత జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాలో..

Earthquake Assam-Jharkhand: జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు..
Earth Quake
Follow us on

Earthquake Assam-Jharkhand: అస్సాం, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆదివారం భూకంపం సంభవించింది. తొలుత జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాలో భూకంపం సంభవించగా.. ఆ తరువాత కాసేపటికే అస్సాంలోని తేజ్‌పూర్‌లో భూమి కంపిపంచింది. దాంతో ఆయనా ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బిక్కు బిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడిరోడ్డుపై నిల్చున్నారు. కాగా, సింగ్‌భూమ్‌లో 2.22 గంటలకు, తేజ్‌పూర్‌లో 2.40 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. ఇక అస్సాంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8 గా నమోదవగా.. జార్ఖండ్‌లో 4.1 తీవ్రత నమోదైంది. ఈ మేరకు నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. ఇవి స్వల్ప ప్రకంపనలే అని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. కాగా, ఈ ఘటనలో ఎలాటి ఆస్తినష్టం గానీ, ప్రాణ నష్టం గానీ సంభవించలేదని అధికారులు ప్రకటించారు.

భూకంపాలు ఎందుకు వస్తాయంటే..
భూమి అనేక పొరలుగా విభజించబడింది. భూమి లోపల అనేక రకాల పలకలు(ప్లేట్స్)ఉన్నాయి. అయితే, భూమి లోపలి ఉష్ణోగ్రతల కారణంగా.. ప్లేట్లు కొన్నిసార్లు కదులుతుంటాయి. ఆ కారణంగా భూ ప్రకంపనలు సంభిస్తుంటాయి. కొన్నిసార్లు తీవ్రమైన భూకంపాలు సంభిస్తుంటాయి. ఇక భారతదేశంలో భూమి లోపలి పొరల ఆధారంగా భౌగోళికంగా 5 జోన్లుగా విభజించారు. ఆయా మండలాల్లో కొన్ని చోట్లు ఎక్కువగా.. మరికొన్ని చోట్ల తక్కువగానరూ భూప్రకంపనలు సంభవిస్తుంటాయి. జోన్ 5లో అధికంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. 4,3 జోన్లలో స్వల్పంగా వస్తాయి.

Also read:

Extramarital Affair: ఇద్దరితో వివాహేతర సంబంధం.. గర్భం దాల్చిన మహిళ.. ప్రియుల ఫైట్.. చివరికి

Indians Hight: ఎత్తు తగ్గుతున్న భారతీయులు.. ఎత్తు ఎందుకు తగ్గుతున్నారు? సగటు ఎత్తు తక్కువగా ఉందంటే అర్ధం ఏమిటి?

Vikram : కమల్ హాసన్- లోకేష్ కనగరాజ్ కాంబోలో రానున్న ‘విక్రమ్’.. శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్న యూనివర్సల్ హీరో…