Duologue With Barun Das: ఇండియన్ మీడియా హిస్టరీలో సంచలనం.. అర్నబ్‌ గోస్వామీతో టీవీ9 సీఈఓ బరున్‌ దాస్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ..

| Edited By: Ravi Kiran

Sep 22, 2022 | 12:21 PM

Duologue With Barun Das: భారతీయ మీడియా చరిత్రలో ఆసక్తికర దృశ్యానికి టీవీ9 వేదికైంది. తనదైన ప్రశ్నోత్తరాలతో డిబేట్‌లకు హాజరయ్యే అతిథులను ఇరుకునపెట్టే ప్రముఖ జర్నలిస్ట్‌ అర్నబ్‌ గోస్వామీ తానే అతిథిగా మారి..

Duologue With Barun Das: ఇండియన్ మీడియా హిస్టరీలో సంచలనం.. అర్నబ్‌ గోస్వామీతో టీవీ9 సీఈఓ బరున్‌ దాస్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ..
Duologue With Barun Das
Follow us on

Duologue With Barun Das: భారతీయ మీడియా చరిత్రలో ఆసక్తికర దృశ్యానికి టీవీ9 వేదికైంది. తనదైన ప్రశ్నోత్తరాలతో డిబేట్‌లకు హాజరయ్యే అతిథులను ఇరుకునపెట్టే ప్రముఖ జర్నలిస్ట్‌ అర్నబ్‌ గోస్వామీ తానే అతిథిగా మారి ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. టీవీ 9 నెట్‌వర్క్‌ ఎండీ కమ్‌ సీఈఓ బరున్‌ దాస్‌ హోస్ట్‌గా ‘డూయోలాగ్‌ విత్‌ బరున్‌ దాస్‌’ అనే టాక్‌ షో ప్రసారమవుతోన్న విషయం తెలిసిందే. న్యూస్‌ 9 ప్లస్‌ యాప్‌లో ఈ ఇంటర్వ్యూలు ప్రసారమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్‌లో నటుడు విజయ్‌ దేవరకొండ, బ్రిటన్‌ మాజీ ప్రైమ్‌ మినిస్టర్‌ డేవిడ్‌ కామరున్‌ పాల్గొన్నారు. తాజాగా ఈ షోకు అతిథిగా ప్రముఖ జర్నలిస్ట్‌ అర్నబ్‌ గోస్వామీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ ఇంటర్వ్యూను మొత్తం నాలుగు ఎపిసోడ్‌లుగా విభజించారు. ఇందులో ఇబ్బందులు కలిగించే వారు, స్నేహితులు, మీడియా, ఫ్రాంక్లీ స్పీకింగ్‌ అనే అంశాలను అర్నబ్‌ చర్చించారు. గతంలో రిపబ్లిక్‌ టీవీకి సంబంధించి రేటింగ్‌ స్కామ్‌ విషయంలో వచ్చిన ఆరోపణలపై అర్నబ్‌ స్పందించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అర్నక్‌కు క్లీన్‌ చీట్‌ ఇచ్చిన తర్వాత అర్నబ్‌ తనపై వచ్చిన ఆరోపణలపై తొలిసారి స్పందించారు. మొత్తం రేటింగ్ వ్యవస్థ తనను టార్గెట్ చేసిందని, దీనిని.. కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకున్న వారికి లెగసీ మీడియాకు మధ్య జరిగిన చేదు యుద్ధంగా అర్నబ్‌ అభివర్ణించారు.

అలాగే ఈ ఇంటర్వ్యూలో భారత్‌తో పాటు విదేశాల్లో మీడియా తీరు తెన్నులు ఎలా ఉన్నాయన్నదానిపై చర్చించారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలకు సరైన సమాధానం ఇచ్చేందుకు ఈ ప్రోగ్రామ్‌ వేదికగా మారిందని ఇందుకు బరున్‌ దాస్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు అర్నబ్‌ చెప్పుకొచ్చారు. వీటితో పాటు మరెన్నో ఆసక్తికర, సంచనల విషయాలను అర్నబ్‌ పంచుకున్నారు. ఈ ఇంటర్యూకి సంబంధించిన పూర్తి వీడియోలను చూడాలంటే ఈ లింక్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..