DRDO: డీఆర్‌డీవో చరిత్రలో మరో మైలురాయి.. సీక్రెట్ మిస్సైల్‌ సక్సెస్‌ఫుల్‌..

|

Aug 24, 2022 | 8:10 AM

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనైజేష‌న్, ఇండియ‌న్ నేవీ సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించాయి. VL-SRSAM క్షిప‌ణిని డీఆర్డీవో స్వదేశీ టెక్నాల‌జీతో రూపొందించి, అభివృద్ధి చేసింది. 360 డిగ్రీల కేపబిలిటీతో ఈ మిస్సైల్ పనిచేస్తుంది.

DRDO: డీఆర్‌డీవో చరిత్రలో మరో మైలురాయి.. సీక్రెట్ మిస్సైల్‌ సక్సెస్‌ఫుల్‌..
Indian Navy And Drdo Vl Srsam
Follow us on

నేవీ అమ్ములపొదిలో మరో బ్రహ్మస్త్రం చేరింది. ఉపరితల నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మిస్సైల్‌ను ఇండియన్‌ నేవీ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిప‌ణిని ప‌రీక్షించింది. నేవీ షిప్‌ నుంచి హై స్పీడ్ మావ‌న‌ర‌హిత విమానాన్ని ఈ క్షిప‌ణి విజ‌య‌వంతంగా ఛేదించింది. స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌తో కూడిన క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యానికి చేరుకున్నాయి. క్షిప‌ణి ప్రయోగ ప‌రీక్ష విజ‌య‌వంతం కావ‌డంతో డీఆర్డీవో, భార‌త నౌకాద‌ళంతో పాటు ఈ ప్రయోగం కోసం పని చేసిన వారందరినీ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభినందించారు. ఇది భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనైజేష‌న్, ఇండియ‌న్ నేవీ సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించాయి. VL-SRSAM క్షిప‌ణిని డీఆర్డీవో స్వదేశీ టెక్నాల‌జీతో రూపొందించి, అభివృద్ధి చేసింది. 360 డిగ్రీల కేపబిలిటీతో ఈ మిస్సైల్ పనిచేస్తుంది. ముప్పును పసిగట్టడంలో ఈ మిస్సైల్ సమర్థవంతంగా పనిచేస్తుందని DRDO చైర్మన్ సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. VL-SRSAM సిరీస్‌లో ఇది నాల్గవ ప్రయోగం. 22 పిబ్రవరి 2021 లో మిస్సైల్స్ ప్రయోగం జరిగింది. 7డిశంబర్ 2021న రెండో ప్రయోగం.. 24 జూన్ 2022న మూడో మిస్సైల్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పుడు నాలుగో మిస్సైల్‌ ప్రయోగంలో సక్సెస్ అయింది. ఈ మిస్సైల్‌ పరీక్ష విజయవంతం కావడంతో నేవీ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది DRDO.