Cyclone Tauktae: తీవ్ర తుఫానుగా మారిన తౌక్తా.. అల్లకల్లోలంగా సముద్రం.. రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

|

May 16, 2021 | 6:06 AM

Cyclone Tauktae: తౌక్తా తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. ఉత్తర దిశగా..గంటకు 12 కి.మీటర్ల వేగంతో ప్రయాణించి.. నిన్న సాయంత్రం తీవ్ర తఫానుగా మారింది. గోవాకు దక్షిణ..

Cyclone Tauktae: తీవ్ర తుఫానుగా మారిన తౌక్తా.. అల్లకల్లోలంగా సముద్రం.. రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు
Cyclone Tauktae
Follow us on

Cyclone Tauktae: తౌక్తా తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. ఉత్తర దిశగా.. గంటకు 12 కి.మీటర్ల వేగంతో ప్రయాణించి.. నిన్న సాయంత్రం తీవ్ర తఫానుగా మారింది. గోవాకు దక్షిణ నైరుతి దిశగా..220 కి.మీటర్లు, ముంబైకి దక్షిణ నైరుతి దిశగా..590 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. క్రమంగా బలపడి రాగల 12 గంటల్లో అతి తీవ్ర తుఫాన్ గా మారనుందని శనివారమే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర వాయువ్య దిశగా, తుఫాను ప్రయాణించనుంది. గుజరాత్‌ తీరం పోరుబందర్‌ – నలియాల మధ్య ఈనెల 18న మధ్యాహ్నం లేదా సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తుఫాను కల్లోలం సృష్టిస్తోంది. గాలులు వేగంగా వీస్తున్నాయి. గాలుల ధాటికి చెట్లు, కరెంటు స్థంబాలు సైతం నేలకూలిపోతున్నాయి.

అల్లకల్లోలంగా మారిన సముద్రం:

కాగా, తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాను ప్రభావం ఎక్కువగా కేరళ రాష్ట్రంపై కనిపిస్తోంది. ఇడుక్కి, పాలక్కాడ్‌, మల్లాపురం, త్రిశూర్‌, కోజికోడ్‌, వయనాడ్‌, కన్నూరు, కాసరఘడ్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌, సహాయక బృందాలు మోహరించి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. త్రిశూర్‌లో చాలా గ్రామాలు నీట మునిగాయి.

మోదీ అత్యవసర సమీక్ష:

తుఫాను కారణంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్‌డీఎంఏ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు అధికారులు. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడుకు తుఫాను ప్రభావం ఉందని అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి

Delhi Posters: ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తూ పోస్టర్లు.. 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు

Cyclone Tauktae Tracker and Updates: కేరళను కమ్మేసిన తౌక్తా.. భారీగా కురుస్తున్న వర్షాలు… రంగంలోకి దిగిన NDRF బృందాలు..