Congress 8th List: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ ఎనిమిదో జాబితా విడుదల.. సీనియర్ నేతకు దక్కిన ఛాన్స్!

|

Mar 28, 2024 | 7:39 AM

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను విడుదల చేసింది. బుధవారం (మార్చి 27, 2024) రాత్రి ఆలస్యంగా వచ్చిన ఈ జాబితాలో మొత్తం 14 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ స్థానాలకు సంబంధించి మొత్తం నాలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించారు.

Congress 8th List: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ ఎనిమిదో జాబితా విడుదల.. సీనియర్ నేతకు దక్కిన ఛాన్స్!
Congress
Follow us on

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను విడుదల చేసింది. బుధవారం (మార్చి 27, 2024) రాత్రి ఆలస్యంగా వచ్చిన ఈ జాబితాలో మొత్తం 14 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ స్థానాలకు సంబంధించి మొత్తం నాలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించారు.

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై మధ్యప్రదేశ్‌లోని గుణ స్థానం నుంచి రావ్ యద్వేంద్ర సింగ్‌కు అవకాశం ఇవ్వగా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ విదిశా నుంచి ప్రతాప్ భాను శర్మను పోటీకి దింపింది. ఇక తెలంగాణలో ఉన్న మొత్తం 17 స్థానాలకు గాను ఇప్పటికే 9 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయగా.. తాజాగా మరో నలుగురితో జాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ స్థానాలకు మాత్రమే తెలంగాణలో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

కాంగ్రెస్ పార్టీ 8వ జాబితాలోని అభ్యర్థులు

నిజామాబాద్- తాటిపర్తి జీవన్ రెడ్డి

ఆదిలాబాద్(ఎస్టీ)- డాక్టర్ సుగుణ కుమారి

మెదక్- నీలం మధు

భువనగిరి- చామల కిరణ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్‌ పెండింగ్‌ సీట్లుః

కరీంనగర్‌
వరంగల్
ఖమ్మం
హైదరాబాద్‌

దీనికంటే ఒక రోజు ముందు, 2024 మార్చి 26న జరిగిన ‘సెంట్రల్ ఎలక్షన్ కమిటీ’ (CEC) సమావేశంలో సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల పేర్ల ఏడవ జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో ఐదు పేర్లు ఉన్నాయి. నలుగురు పేర్లు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవి కాగా, ఒకరి పేరు తమిళనాడుకు చెందిన నియోజకవర్గాలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా (ఎస్టీ) నుంచి శశి సింగ్, రాయ్‌గఢ్ (ఎస్టీ) నుంచి డాక్టర్ మైన్ దేవి సింగ్, బిలాస్‌పూర్ నుంచి దేవేంద్ర సింగ్ యాదవ్, కాంకేర్ (ఎస్టీ) నుంచి బీరేష్ ఠాకూర్‌లకు అవకాశం ఇవ్వగా, మైలాడుతురై స్థానం నుంచి ఆర్ సుధ బరిలోకి దిగారు.

కాంగ్రెస్ అభ్యర్థుల ఎనిమిదో జాబితా ఇలా ఉంది.

Congress 8th List

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…