Rafale Deal: మళ్లీ తెరపైకి రఫేల్ రగడ.. దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం…అక్రమాలు జరిగాయంటున్న కాంగ్రెస్‌

|

Apr 06, 2021 | 1:24 PM

Rafale Jet Fighter: రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై మరోమారు రాజకీయ దుమారం రేగింది. రఫేల్‌ ఒప్పందంలో ఎన్నో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై...

Rafale Deal: మళ్లీ తెరపైకి రఫేల్ రగడ.. దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం...అక్రమాలు జరిగాయంటున్న కాంగ్రెస్‌
Rafale Deal
Follow us on

Rafale Jet Fighter: రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై మరోమారు రాజకీయ దుమారం రేగింది. రఫేల్‌ ఒప్పందంలో ఎన్నో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై పూర్తి దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. అయితే రఫేల్‌ జెట్లను తయారు చేసే డసో సంస్థ.. కొందరు మధ్యవర్తులకు ముడుపులు చెల్లించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై బీజేపీ సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. ఇక ఈ వాదనలను తోసిపుచ్కచిన బీజేపీ.. విపక్షంపై ఎదురు దాడికి దిగింది. 2016లో రఫేల్‌ ఒప్పందం జరిగిన తర్వాత విమాన తయారీదాఉ డసో సంస్థ మధ్యవర్తిగా వ్యవహరించిన భారత కంపెనీ’డిఫ్సిస్‌’ సొల్యూషన్స్‌కు రూ.9 కోట్ల 48 లక్షలు చెల్లించిందని ఫ్రెంచ్‌ అవినీతి నిరోధక సంస్థ దర్యాప్తులో తేలినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని విమర్శనాస్త్రాలుగా మలుచుకుని కాంగ్రెస్‌, రఫేల్‌ ఒప్పందంలో అవినీతి భారీగా జరిగిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తరచూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నాయని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా తెలిపారు. దేశ అతిపెద్ద రక్షణ ఒప్పందంలో భారత ప్రభుత్వంలో ఎవరికి, ఎంత మేరకు ముడుపులు అందాయో తేల్చేందుకు దర్యాప్తు అవసరమని సుర్జేవాలా అన్నారు.

ఈ ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. డసో సంస్థ మధ్యవర్తికి చెల్లించిన ఆ మొత్తాన్ని తమ ఖర్చుల ఖాతాలో క్లయింట్స్‌కు గిఫ్ట్‌ ఇచ్చినట్లు నమోదు చేసిందని తెలిపారు. నిజానికి ఆ మొత్తం మధ్యవర్తికి చెల్లించిన కమీషన్‌ అని ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తీవ్రంగా ఖండించారు. రఫేల్‌ కొనుగోలు విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని సుప్రీం కోర్టు, కాగ్‌ ఇప్పటికే స్పష్టం చేసిందని అన్నారు ఫ్రాన్స్‌కు చెందిన దసో సంస్థ నుంచి 36 రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో 2016లో దసో సంస్థతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రఫేల్‌ రగడ దేశంలో పెద్ద దుమారం రేపుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ రఫేల్‌ రగడ తెరపైకి చ్చింది. ఈ జెట్‌ల తయారీదారు దసో ఏవియేషన్‌, భారత్‌కు చెందిన ఒక బ్రోకర్ కు మధ్య ఒప్పందం కుదిరింది. 10,17,850 యూరోల (రూ.8.8 కోట్లు)ను చెల్లించినట్లు ఫ్రాన్స్ లోని మీడియా పార్ట్‌ లో కథనం వెలువడింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ చెబుతుంటే.. ఆధారాలు లేని ఆరోపణలని బీజేపీ చెబుతోంది.

ఇవీ చదవండి: IRCTC: ఐఆర్‌సీటీసీ అదరిపోయే ఆరు రోజుల టూర్‌ ప్యాకేజీ.. ఈ అందమైన ప్రదేశాలను తిలకించవచ్చు

Best Selling Bikes: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్‌ -10 బైక్‌లు ఇవే.. అత్యధిక మైలేజ్‌.. వాటి ధరలు.. !

Electric Bike: ఈ బైక్‌ 17 రూపాయిల‌తో 116 కిలోమీట‌ర్ల ప్రయాణం.. అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ బైక్‌

SBI Interest Rates: కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్‌..ఆ వడ్డీ రేటు భారీగా పెంపు..ఎంత పెంచారంటే..