ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో ఆదివారం(అక్టోబర్ 3) నక్సలైట్లు భారీ ఘటనకు పాల్పడ్డారు. జహాన్‌లోని జాగర్‌గుండ గ్రామంలోని అదివారం మార్కెట్‌లో సాధారణ దుస్తుల్లో ఉన్న నక్సలైట్లు ఇద్దరు పోలీసులపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. నక్సలైట్ల దాడిలో ఇద్దరు పోలీసులకూ గాయాలయ్యాయి. ఆ తర్వాత మావోయిస్టులు వారి వద్ద ఉన్న అధికారిక రైఫిల్ తీసుకుని ఘటనా స్థలం నుంచి పారిపోయారు.
పిటిఐ కథనం ప్రకారం, నక్సల్స్ దాడి తర్వాత వారపు మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. వీక్లీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని అక్కడ పోలీసులను మోహరించినట్లు అధికారులు తెలిపారు.
విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్‌పై పదునైన ఆయుధంతో మావోయిస్టులు దాడి చేశారని స్థానిక పోలీసులు తెలిపారు. నక్సలైట్ల యాక్షన్ టీమ్ కానిస్టేబుళ్లు కరాటం దేవా, సోధి కన్నలపై పదునైన ఆయుధాలతో దాడి చేసి, ఆపై వారి రైఫిళ్లను దోచుకుని పారిపోయారని పోలీసు అధికారి తెలిపారు. అక్కడ మోహరించిన ఇతర భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి దాడి చేసిన వారి కోసం వెతకడం ప్రారంభించారు. ఘటనా స్థలంలో పోలీసు బలగాల మోహరింపును పెంచారు. దీంతో పాటు నక్సలైట్ల ఆచూకీ కోసం పలు చోట్ల తనిఖీలు చేస్తున్నారు.
నక్సలైట్ల దాడిలో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లను మొదట స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు, అయితే తరువాత వారిని రాయ్‌పూర్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఇద్దరు పోలీసులు రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిలో గాయపడిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను జాగర్గుండ పోలీస్ స్టేషన్‌కు చెందిన వారుగా గుర్తించారు.
బస్తర్ డివిజన్‌లో సుక్మాతో సహా ఏడు జిల్లాలు ఉన్నాయి. బస్తర్ డివిజన్‌లో గతంలోనూ పలుమార్లు నక్సలైట్లు వీక్లీ మార్కెట్లలో భద్రతా సిబ్బందిని టార్గెట్ చేశారు. కొన్ని వారాల క్రితం, బస్తర్‌లోనే నక్సలైట్లపై ఒక పెద్ద ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. ఇందులో 31 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..