జకీర్ నాయక్ ఛానళ్ళపై నిషేధం ?

వివాదాస్పద ఇస్లామిక్ స్కాలర్ జకీర్ నాయక్ నేతృత్వంలోని 'పీస్ టీవీ ఛానల్', మొబైల్ యాప్, యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించాలని కేంద్రం యోచిస్తోంది. తన నెట్ వర్క్ ద్వారా ఆయన  ద్వేష పూరితమైన..

జకీర్ నాయక్  ఛానళ్ళపై నిషేధం ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 24, 2020 | 3:55 PM

వివాదాస్పద ఇస్లామిక్ స్కాలర్ జకీర్ నాయక్ నేతృత్వంలోని ‘పీస్ టీవీ ఛానల్’, మొబైల్ యాప్, యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించాలని కేంద్రం యోచిస్తోంది. తన నెట్ వర్క్ ద్వారా ఆయన  ద్వేష పూరితమైన, మతపర ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాడని కేంద్రం భావిస్తోంది. పరారీలో ఉన్న జకీర్ ప్రస్తుతం మలేసియాలో  తలదాచుకున్నట్టు తెలుస్తోంది. ఇతని టీవీ ఛానల్, దాని యాప్ అమాయక ముస్లిం యువకులను రిక్రూట్ చేసుకుని వారి ద్వారా భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ బ్యూరో హోం శాఖకు ఓ నివేదిక సమర్పించింది.

తన ప్రసంగాల ద్వారా దేశంలో మతపరమైన సెంటిమెంట్లను జకీర్ నాయక్ రెచ్ఛగొడుతున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. దేశంలో ఒక వర్గం సంఖ్య తక్కువగా ఉందని, అందువల్ల మన వర్గానిదే పైచేయిగా ఉండాలని..ఇలా అనేక రకాల ప్రచారం ద్వారా ఈయన వివాదాస్పదుడయ్యాడు.