EC: ఉప ఎన్నికలు జరిగే జిల్లా అంతటా కోడ్.. కఠినంగా అమలు చేయండి: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు..

|

Oct 21, 2021 | 6:17 PM

Central Election Commission: దేశంలోని పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగం తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని

EC: ఉప ఎన్నికలు జరిగే జిల్లా అంతటా కోడ్.. కఠినంగా అమలు చేయండి: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు..
Election
Follow us on

Central Election Commission: దేశంలోని పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగం తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంపై ప్రభావం చూపేలా పక్క నియోజకవర్గాలలో కార్యక్రమాలు నిర్వహించడంపై ఈసీ అసంతృప్తి వ్యక్తంచేసింది. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంలోని జిల్లా అంతటా నియమావళి వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర రాజధానులు, మెట్రో నగరాలు మినహా అసెంబ్లీ / పార్లమెంట్ నియోజకవర్గం ఉన్న జిల్లా అంతటా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (model code of conduct) అమల్లో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. నియోజకవర్గం వెలుపల జిల్లా పరిధిలో నిర్వహించే ఎన్నికల కార్యక్రమాలు, ఖర్చులను మొత్తం ఆయా పార్టీల అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగానే పరిగణిస్తామంటూ స్పస్టంచేసింది. నియోజకవర్గం ఉన్న జిల్లా పరిధిలో ఇలాంటి ఎన్నికల కార్యకలాపాలు నిర్వహించకూడదని రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.

Also Read:

Pattabhi: టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్‌.. బెయిల్‌ నిరాకరించిన కోర్టు.. మచిలీపట్నం జైలుకు..

Crime News: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం.. ఆటో, పొక్లెయిన్ ఢీకొని.