Cyclone: తౌక్తా తుఫాను ఎఫెక్ట్‌: మే 16 నుంచి 19వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు చేస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం

|

May 16, 2021 | 6:17 AM

Cyclone: అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి ముందు వాయుగుండంగా ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా, ఇప్పుడు తుఫానుగా మారి గుజరాత్‌ తీర ప్రాంతం వైపు దూసుకువస్తోంది..

Cyclone: తౌక్తా తుఫాను ఎఫెక్ట్‌: మే 16 నుంచి 19వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు చేస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం
Trains Cancels
Follow us on

Cyclone Effect: అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి ముందు వాయుగుండంగా ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా, ఇప్పుడు తుఫానుగా మారి గుజరాత్‌ తీర ప్రాంతం వైపు దూసుకువస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తీర ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలను మోహరించి సహాయక చర్యల కోసం రెడీగా ఉంచారు. అదే విధంగా పశ్చిమ రైల్వే సైతం అప్రమత్తమైంది. తుఫాను నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టింది. మే 16 నుంచి 19వ తేదీ వరకు పలు రైలు సర్వీసులను రద్దు చేయగా, పలు రైళ్ల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది. తుఫాను కారణంగా తీవ్ర ఆటంకాలు కలిగే అవకాశాలున్నందున రైల్వే శాఖ ముందస్తుగా అప్రమత్తమై ఈ కొన్ని రైళ్లను రద్దు చేస్తూ, మరి కొన్ని రైళ్ల రాకపోకలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
కాగా, పూరి, ఓఖా, రాజ్‌కోట, పోర్‌బందర్‌, సికింద్రాబాద్‌ రైళ్లను రద్దు చేసింది రైల్వేశాఖ.

కాగా, ముందే కరోనాతో అల్లాడిపోతుంటే ఇదే సమయంలో తౌక్తా తుఫాను గండం వస్తుంది. కేరళలోని కొచ్చి తీరానికి సమీపంలో ఏర్పడ్డ ఈ తౌక్తా తుఫాను భీకర తుఫానుగా మారి వరదలు వచ్చే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది.

అయితే ప్రతికూల వాతావరణం కారణంగా విస్టారా, ఇండిగో ఎయిర్‌లైన్స్‌ చెన్నై, తిరువనంతపురం, కొచ్చి, బెంగళూరు, ముంబై, పూణె, గోవా, అహ్మదాబాద్‌లకు విమానాశ్రయాల్లో విమానాలకు హెచ్చరికలు జారీ చేశాయి. ఆదివారం నాటికి బలమైన తుఫానుగా తౌక్తా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

 

 

 

ఇవీ చదవండి:

Delhi Posters: ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తూ పోస్టర్లు.. 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు

‘ఆశా దశ’ ,నిలకడగా కోవిడ్ సెకండ్ వేవ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో తగ్గిన కేసులు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన