Armstrong: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు దారుణ హత్య.. ఖండించిన మాయావతి, హీరో విజయ్..

|

Jul 06, 2024 | 10:44 AM

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది.. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. సెంబియం ప్రాంతంలో ఆర్మ్ స్ట్రాంగ్ తన నివాసానికి సమీపంలో కొంతమంది పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా బైకులపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి.. అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన అతడ్ని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు.

Armstrong: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు దారుణ హత్య.. ఖండించిన మాయావతి, హీరో విజయ్..
Armstrong
Follow us on

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది.. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. సెంబియం ప్రాంతంలో ఆర్మ్ స్ట్రాంగ్ తన నివాసానికి సమీపంలో కొంతమంది పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా బైకులపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి.. అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన అతడ్ని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఇది ప్రతీకార హత్య కావొచ్చని అనుమానిస్తున్నారు. నిందితులు ఫుడ్ డెలివరీ ఏజెంట్లు మాదిరిగా వచ్చి దాడి చేశారు. సీసీటీవీలో దుండగులు పారిపోతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. గత ఏడాది ఆర్కాట్ సురేష్ అనే గ్యాంగ్‌స్టర్ హత్యతో సంబంధం ఉన్నందున ఇది ప్రతీకార హత్య అయి ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, “మేము విచారణ జరుపుతున్నాము. హత్య మునుపటి హత్యతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది.” అని పేర్కొన్నారు. హత్యకేసులో ఇప్పటి వరకు 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. అనుమానితులను విచారించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. హత్యకు పదునైన ఆయుధాలు ఉపయోగించారని.. విచారిస్తున్నామని.. చెన్నై సీనియర్ పోలీసు అధికారి అస్రా గార్గ్ చెప్పారు. కేసు దర్యాప్తుకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. పరారైన నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక టింలతో గాలిస్తున్నట్లు సెంబియం పోలీసులు తెలిపారు.

ఈ ఘటనను బీఎస్పీ చీఫ్ మాయావతి ఖండించారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ దళితుల బలమైన గొంతుక అని, అతడిని హత్య చేసిన దోషులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. బీఎస్పీ అధ్యక్షుడి హత్యను తీవ్రంగా ఖండించారు తమిళ హీరో విజయ్‌. ఈ హత్య దిగ్భ్రాంతిని.. బాధను కలిగించిందన్నారు. సీఎం స్టాలిన్‌ వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు హీరో విజయ్.. ఆర్మ్‌స్ట్రాంగ్‌ డెడ్‌బాడీ ఉంచిన ఆసుపత్రి దగ్గర BSP కార్యకర్తలు ధర్నా చేశారు. దుండగులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య నేపథ్యంలో అధికార డీఎంకేపై ప్రతిపక్ష ఏఐఏడీఎంకే విరుచుకుపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఈ హత్యే అందుకు నిదర్శనమని తీవ్రంగా విమర్శించింది. ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధినేత హత్యకు గురయ్యాక ఇంకేం మాట్లాడగలమని, రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితి సిగ్గుచేటని పళనిస్వామి తీవ్రంగా విమర్శించారు.

సెంబియం ప్రాంతంలోని తన ఇంటి దగ్గర కొద్దిమంది పార్టీ కార్యకర్తలతో ఆర్మ్‌స్ట్రాంగ్ చర్చలు జరుపుతున్నప్పుడు ఆరుగురు వ్యక్తులు అతనిపై దాడి చేసి, ఆపై పారిపోయారు. కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..