Singer KK Death: సింగర్‌ కేకే మృతిపై విచారణ జరిపిండి.. అమిత్‌షాకు బెంగాల్‌ ఎంపీ సౌమిత్రాఖాన్‌ లేఖ..

|

Jun 02, 2022 | 5:26 PM

Bollywood Singer KK: కేకే కుటుంబానికి న్యాయం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను సౌమిత్రాఖాన్‌ కోరారు. కోల్‌కతా ఆడిటోరియంలో 2500 మంది కెపాసిటీ ఉంటే 7000 మంది ప్రేక్షకులను ఎలా అనుమతించారని ఎంపీ సౌమిత్రాఖాన్‌ బెంగాల్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Singer KK Death: సింగర్‌ కేకే మృతిపై విచారణ జరిపిండి.. అమిత్‌షాకు బెంగాల్‌ ఎంపీ సౌమిత్రాఖాన్‌ లేఖ..
सिंगर केके के निधन पर सेलेब्स ने जताया दुख
Follow us on

సింగర్‌ కేకే(KK) ఆకస్మిక మృతిపై చాలా అనుమానాలు ఉన్నాయి. వెంటనే విచారణ జరిపించండి అంటూ కేంద్రానికి బెంగాల్‌ బీజేపీ ఎంపీ సౌమిత్రాఖాన్‌( MP Saumitra Khan) లేఖ రాశారు. కేంద్ర సంస్థతో దర్యాప్తు జరిపించి కేకే కుటుంబానికి న్యాయం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను సౌమిత్రాఖాన్‌ కోరారు. కోల్‌కతా ఆడిటోరియంలో 2500 మంది కెపాసిటీ ఉంటే 7000 మంది ప్రేక్షకులను ఎలా అనుమతించారని ఎంపీ సౌమిత్రాఖాన్‌ బెంగాల్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హాల్‌లో ఏసీలు కూడా పనిచేయకపోవడంతో కేకే చాలా అస్వస్థతకు గురయ్యారని అన్నారు. అంతేకాకుండా అస్వస్థతకు గురైన కేకేను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా హోటల్‌ రూమ్‌కు నిర్వాహకులు ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. అందుకే కేకే మృతిపై కేంద్రం సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కోరారు.కేకే మృతికి గుండెపోటు కారణమై ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. అయితే, అస్వస్థతకు గురైన సమయంలో కేకే గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడ్డాయని, సమయానికి సీపీఆర్‌ చేసి ఉంటే బతికేవారేమో అని కోల్‌కతా వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

గత మంగళవారం రాత్రి కోల్‌కతాలో లైవ్‌ ప్రదర్శన చేసిన కొద్దిసేపటికే కేకే అస్వస్థతకు గురై చనిపోయారు. గుండె రక్తనాళాల్లో పలు చోట్ల పూడికలు ఏర్పడినట్లు అవే గాయకుడి మరణానికి కారణమైనట్లు పంచనామాలో తేలింది. కేకే అంత్యక్రియలు ముంబై లోని వర్సోవా స్మశానవాటికలో జరిగాయి. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు కేకేకు కన్నీటి వీడ్కోలు పలికారు.

ఇవి కూడా చదవండి

కచేరీ వేదికలోని పరిస్థితులు మరియు ఈవెంట్ కోసం మోహరించిన భద్రత గురించి కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కచేరీ వద్ద పోలీసు బలగాలు మోహరించారా, కచేరీ నిర్వాహకులు ఈవెంట్ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. గరిష్టంగా 3000 మంది సామర్థ్యం ఉన్న వేదిక లోపలికి దాదాపు 7000 మంది ఎలా వచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎసి పనిచేయడం మానేసిన తర్వాత కూడా కచేరీని కొనసాగించడానికి ఎవరు అనుమతించారని కూడా అతను అడిగాడు.