కేబినెట్ నుంచి వైదొలిగిన బీజేపీ నేత

|

Oct 04, 2020 | 3:17 PM

బీజేపీ నేత ఒకరు కర్నాటక ప్రభుత్వం నుంచి వైదొలగడం కన్నడ నాట చర్చనీయాంశమైంది. యడియూరప్ప ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ బీజేపీ నేత సడన్‌గా రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి...

కేబినెట్ నుంచి వైదొలిగిన బీజేపీ నేత
Follow us on

BJP minister resigned from Cabinet: బీజేపీ నేత ఒకరు కర్నాటక ప్రభుత్వం నుంచి వైదొలగడం కన్నడ నాట చర్చనీయాంశమైంది. యడియూరప్ప ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ బీజేపీ నేత సడన్‌గా రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపడంపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. పర్యాటక శాఖ బాధ్యతలను చూస్తున్న సీటీ రవి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, లేఖను ముఖ్యమంత్రికి పంపించారు.

మంత్రి రాజీనామా వెనుక కారణాలను పరిశీలిస్తే ఆయనను ఇటీవల జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ అధిష్టానం నియమించడమే కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించే అవకాశం వుండడంతో ఆయన కర్నాటక ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. వన్ మ్యాన్ వన్ పోస్టు అనే బీజేపీ సిద్ధాంతానికి అనుగుణంగానే ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకున్నారని కమలం పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సోమవారం ఢిల్లీకి వెళ్ళనున్న రవి.. పార్టీ అధినేత జెపీ నడ్డాతో భేటీ అవుతారని సమాచారం.

ఇదిలా వుండగా.. తీవ్ర ఉత్కంఠ తర్వాత గత సంవత్సరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం యడియూరప్ప మరోసారి మంత్రి వర్గ విస్తరణపై కసరత్తు ప్రారంభించారని సమాచారం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి షాకిచ్చి… బీజేపీ పంచన చేరిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. వారిని ఇంకా ఎంతో కాలం ఎదురు చూపుల్లో వుంచలేమని భావిస్తున్న సీఎం కేబినెట్ విస్తరణకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఖాళీ అయిన కేబినెట్ బెర్తులను కూడా ఫిల్ అప్ చేయాల్సిన అవసరం యడియూరప్ప ముందుంది.

Also read:  త్వరలో కేంద్రం మరో షాకింగ్ డెసిషన్… క్షమాభిక్షలపై చట్టం

Also read:  కేసీఆర్‌కు బీజేపీ చీఫ్ లేఖాస్త్రం

Also read: టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి.. బాధ్యతల స్వీకారం

Also Read: స్టీల్ సిటీ దిశగా వడివడిగా మెట్రోరైల్