Vice Presidential Election: ఎన్టీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌కర్‌.. అధికారికంగా ప్రకటించిన జేపీ నడ్డా..

|

Jul 16, 2022 | 8:10 PM

Vice Presidential Election 2022: ఉప రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఎవరిని బరిలో దించుతారనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ ఎన్నికల్లో జగదీప్‌ ధనకర్‌ను ఎన్టీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.

Vice Presidential Election: ఎన్టీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌కర్‌.. అధికారికంగా ప్రకటించిన జేపీ నడ్డా..
Jagdeep Dhankhar
Follow us on

Vice Presidential Election 2022: ఉప రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఎవరిని బరిలో దించుతారనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ ఎన్నికల్లో జగదీప్‌ ధనకర్‌ను ఎన్టీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ప్రస్తుతం జగదీప్‌ పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా జులై 19తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో శనివారం ఢిల్లీలో బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ను జె.పి.నడ్డా ప్రకటించారు.

కాగా 71 ఏళ్ల జగదీప్‌ ధన్‌కర్‌ స్వస్థలం రాజస్థాన్‌.రైతు కుటుంబం నుంచి వచ్చిన జగదీప్ ధనకర్ గతంలో సుప్రీంకోర్టు అడ్వొకేట్‌గా పనిచేశారు. 1989-91 మధ్య జున్‌జున్‌ నియోజక వర్గం నుంచి ఎంపీగా పనిచేశారు. జనతాదళ్‌ నుంచి ఎంపీగా గెలిచారు. రాజస్థాన్‌ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యరు. రాజస్థాన్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజస్థాన్‌ లోని కిషన్‌గంజ్‌ నుంచి 1993-98 మధ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1990లో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..