Nasal Vaccine: కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు ముక్కు ద్వారా.. దేశంలో మొదటి ట్రయల్స్‌ పూర్తి

|

Aug 15, 2022 | 5:41 PM

Nasal Vaccine: గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కరోనా కట్టడికి వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా, మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి..

Nasal Vaccine: కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు ముక్కు ద్వారా.. దేశంలో మొదటి ట్రయల్స్‌ పూర్తి
Nasal Vaccine
Follow us on

Nasal Vaccine: గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కరోనా కట్టడికి వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా, మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. దేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలను జరుపుకుంటుంది. రోజున కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో భారతదేశం గొప్ప విజయాన్ని సాధించింది. కోవాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ కరోనా నాసికా వ్యాక్సిన్ ట్రయల్‌లో గణనీయమైన విజయాన్ని సాధించింది. ఈ వ్యాక్సిన్ శాస్త్రీయ నామం BBV154. నాసికా వ్యాక్సిన్‌పై రెండు రకాల ట్రయల్స్ జరుగుతున్నాయి. మొదటి ట్రయల్ కరోనా రెండు-డోస్ ప్రైమరీ వ్యాక్సిన్‌తో కొనసాగుతోంది. రెండవది బూస్టర్ డోస్ వంటిది. ఇది కోవ్‌షీల్డ్, కోవాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు ఇస్తున్నారు. వీరికి సంబంధించిన మూడో దశ మానవులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు డ్రగ్ కంట్రోలర్‌కు సమర్పించారు. ఇప్పుడు డ్రగ్ కంట్రోలర్ సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ఈ డేటాను సమీక్షిస్తుంది.

ట్రయల్‌లో అద్భుతమైన ఫలితాలు

ఇవి కూడా చదవండి

కరోనా రెండు-డోస్ నాసికా వ్యాక్సిన్ ట్రయల్స్ 3100 మందిపై జరిగాయి. ఈ ట్రయల్స్ భారతదేశంలో 14 ప్రదేశాలలో జరిగాయి. హెటెరోలాగస్ బూస్టర్ డోస్ ట్రయల్స్ 875 మందిపై నిర్వహించారు. ఈ ట్రయల్స్ భారతదేశంలోని 9 ప్రదేశాలలో నిర్వహించారు. రెండు అధ్యయనాలలో పాల్గొనేవారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొలేనట్లు గుర్తించారు నిపుణులు. హెటెరోలాగస్ బూస్టర్ డోస్ అంటే కోవాక్సిన్, కోవ్‌షీల్డ్ వ్యాక్సిన్స్‌ తీసుకున్న వారు కూడా తీసుకునే వ్యాక్సిన్‌.

 


ప్రాథమిక ఫలితాల ప్రకారం.. ఈ నాసికా వ్యాక్సిన్ శ్వాసకోశ వ్యవస్థలో కరోనాతో పోరాడటానికి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. ఈ వ్యాక్సిన్‌ వల్ల ఇన్‌ఫెక్షన్ తక్కువగా వ్యాప్తి చెందుతుంది. అయితే దీనిపై మరింత అధ్యయనం కూడా జరుగుతోంది. సెయింట్ లూయిస్ యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ సహకారంతో భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి