Gulab Jamun: గులాబ్‌ జామూలో బొద్దింక.. రూ. 55వేల నష్టపరిహారం.. ఐదేళ్ల తర్వాత తీర్పు..!

|

Oct 08, 2021 | 11:51 AM

Gulab Jamun: చాలా మంది బయటి పదార్థాలపై మక్కువ చూపిస్తుంటారు. కొన్ని సార్లు బయట ఫుడ్‌ అనారోగ్యానికి కారణమవుతుంటాయి. చూడడానికి ఎంతో శుభ్రంగా..

Gulab Jamun: గులాబ్‌ జామూలో బొద్దింక.. రూ. 55వేల నష్టపరిహారం.. ఐదేళ్ల తర్వాత తీర్పు..!
Follow us on

Gulab Jamun: చాలా మంది బయటి పదార్థాలపై మక్కువ చూపిస్తుంటారు. కొన్ని సార్లు బయట ఫుడ్‌ అనారోగ్యానికి కారణమవుతుంటాయి. చూడడానికి ఎంతో శుభ్రంగా కనిపించే బయట ఫుడ్‌లో కూడా చాలా వరకు కల్తీ జరుగుతోంది. ఇక పేరొందిన రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లో ఆహారపదార్థాల్లో బల్లులు, బొద్దింకలు, పురుగులు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. మామూలుగా సాంబార్ లో బొద్దింకలు రావడం అనే ఘటనలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. అయితే బెంగళూరులో ఓ రెస్టారెంట్ లో కస్టమర్ కు గులాబ్‌ జామ్‌లో ఓ బొద్దింక రావడం ఆందోళనకు గురి చేసింది. దీనికి గానూ అతనికి భారీ ఎత్తున నష్టపరిహారం చెల్లించుకోవాల్సిన సమయం వచ్చింది. సదరు రెస్టారెంట్ యజమాని ఇప్పుడు ఈ నష్టపరిహారం చెల్లించలేక లబోదిబో మంటున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 2016లో రాజన్న అనే వ్యక్తి గాంధీనగర్‌లోని కామత్ హోటల్ లో గులాబ్ జామూన్ ఆర్డర్ ఇచ్చాడు. రెస్టారెంట్ వాళ్లూ ఎంతో జాగ్రత్తగా సర్వ చేశారు. అయితే అందులో బొద్దింక ఉన్న విషయం వారు గమనించలేదు. తిందామని స్పూన్ పెట్టగానే ఎంచక్కా బొద్దింక కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన కస్టమర్‌ రెస్టారెంట్‌ సిబ్బందికి చెప్పాడు. వెంటనే అతను మొబైల్‌ ఫోన్‌తో వీడియో తీయబోయాడు. అయితే రెస్టారెంట్ సిబ్బంది అతడిని వీడియో తీయనీయకుండా మొబైల్ ను లాక్కోబోయారు. ఇక కస్టమర్‌ రెస్టారెంట్‌ యజమానికి ఫిర్యాదు చేశాడు. అయితే రోజులు గడుస్తున్నా వారినుంచి ఎలాంటి సమాధానం లేదు. దీంతో విసిగిపోయి.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో, వినియోగదారుల ఫోరంలోనూ కేసులు వేశాడు.

ఇక ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న వినియోగదారుల ఫోరం ఈ కేసు మీద విచారణ చేపట్టింది. ఐదేళ్ల తరువాత తీర్పు వచ్చింది. బాధితుడు రాజన్నకు రూ. 55 వేల పరిహారం చెల్లించాలని రెస్టారెంట్‌ యజమానిని ఆదేశించింది.

ఇవీ కూడా చదవండి:

Blue Color Aadhaar: నీలం రంగులో ఉన్న ఆధార్‌ను ఎవరికి జారీ చేస్తారు.. ఈ కార్డు పొందడం ఎలా..?

Hyderabad Tour Package: పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. దసరా సెలవుల్లో హైదరాబాద్‌ స్పెషల్‌ టూర్ ప్యాకేజీ