బెంగాల్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయంటున్న బీజేపీ

పశ్చిమ బెంగాల్‌ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరారు.. మమతా బెనర్జీ పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు.. సుపరిపాలన అందించే సామర్థ్యం తృణమూల్‌ కాంగ్రెస్‌కు లేదన్నారు.

బెంగాల్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయంటున్న బీజేపీ
Follow us

| Edited By: Sanjay Kasula

Updated on: Sep 24, 2020 | 1:31 PM

పశ్చిమ బెంగాల్‌ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరారు.. మమతా బెనర్జీ పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు.. సుపరిపాలన అందించే సామర్థ్యం తృణమూల్‌ కాంగ్రెస్‌కు లేదన్నారు. ప్రజలకు రక్షణ కొరవడిందని మండిపడ్డారు.. శాంతియుత వాతావరణమే లేదన్నారు.. అంతేనా… శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి కాబట్టి తక్షణమే జోక్యం చేసుకోవలసిందిగా కేంద్ర హోమ్‌మంత్రి అమిత్‌షాకు ఓ లేఖ రాశారు.. ఈ మధ్యనే ఆరుగురు ఆల్‌ఖైదా తీవ్రవాదులను అదుపులో తీసుకున్న సంగతిని ఆ లేఖలో ప్రస్తావించారు.. మిద్నిపూర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దిలీప్‌ఘోష్‌ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ఉగ్రవాదులకు బెంగాల్‌ ఒక అడ్డాగా మారిందని తీవ్ర ఆరోపణలు చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనలో చీకటిశక్తులు పెట్రేగిపోతున్నాయని, అక్రమ ఆయుధాల తయారీకి కేంద్ర బిందువుగా రాష్ట్రం మారిందని అమిత్‌షాకు రాసిన లేఖలో విన్నవించుకున్నారు దిలీప్‌ ఘోష్‌. బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందన్నారు.

బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.. బెంగాల్‌లో పాగా వేయాలన్నది బీజేపీ లక్ష్యం.. ఆ దిశగా అడుగులు వేస్తున్నది.. 2019 ఎన్నికల్లో 42 లోక్‌సభ స్థానాలలో బీజేపీ ఏకంగా 18 స్థానాలను గెల్చుకుని తృణమూల్‌కు గట్టి సందేశమే ఇచ్చింది.. 2014 ఎన్నికల్లో కేవలం రెండు లోక్‌సభ సీట్లను గెల్చుకున్న బీజేపీ అయిదేళ్లలోనే తన బలాన్ని అమితంగా పెంచుకోగలిగింది. వచ్చే ఏడాది బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.. అందుకే ఇప్పటి నుంచే గ్రౌండ్‌ వర్క్‌ను మొదలు పెట్టింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం..

Latest Articles
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో