Ashwini Vaishnaw: వాళ్ల సంగతి చూడాల్సిందే.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై కేంద్రం సంచలన ప్రకటన..

|

Nov 27, 2024 | 1:57 PM

సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదేరకమైన వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంపై కేంద్రం ప్రభుత్వం లోక్‌సభ వేదికగా కీలక ప్రకటన చేసింది..

Ashwini Vaishnaw: వాళ్ల సంగతి చూడాల్సిందే.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై కేంద్రం సంచలన ప్రకటన..
Ashwini Vaishnaw
Follow us on

ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో కించపర్చేలా పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయని.. నాయకులను, మహిళలను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు సైతం పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వాళ్లను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తున్న వారిని ఎలా నియంత్రించాలనే అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదేరకమైన వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంపై కేంద్రం ప్రభుత్వం లోక్‌సభ వేదికగా కీలక ప్రకటన చేసింది.. అలాంటి వాళ్ల సంగతి చూస్తామంటూ పేర్కొంది. సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులపై సీరియస్‌ అయిన కేంద్రం.. అసభ్య కంటెంట్‌ నియంత్రించడానికి కఠిన చట్టం తెస్తామని కేంద్రం తెలిపింది.

సోషల్ మీడియాలో అసభ్యకరమైన కంటెంట్‌ను తనిఖీ చేసేలా చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ అంశంపై స్టాండింగ్‌ కమిటీ దృష్టిపెడుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. మనకు, విదేశాలకు సంస్కృతుల్లో చాలా తేడా ఉందని చెప్పారు.. సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులపై.. ప్రశ్నోత్తరాల్లో ఎంపీ అరుణ్‌ గోవిల్‌ ప్రశ్నకు అశ్వినీ వైష్ణవ్‌ ఈ విధంగా జవాబు చెప్పారు. దినపత్రికలు, మీడియా సంస్థల్లో ఎడిటోరియల్ కంటెంట్‌ను తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా ఎడిటోరియల్ వ్యవస్థ ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏవైనా తప్పులు దొర్లితే దాన్ని సరి చేస్తారని.. సోషల్ మీడియాలో మాత్రం అలాంటి వ్యవస్థ ఏదీ లేదంటూ తెలిపారు. యూజర్లు మీడియాకు మించి స్వేచ్ఛగా వ్యవహరిస్తోన్నారని, ఫలితంగా అనేక రకాల అసభ్యకరమైన కంటెంట్‌ పోస్ట్ అవుతోందని తెలిపారు.

వీడియో చూడండి..

ఈ సమస్యను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ టేకప్ చేస్తుందని.. కఠినమైన చట్టాలను రూపొందించాలని తాను కోరుకుంటున్నానని అశ్విని వైష్ణవ్ తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అసభ్యకరమైన కంటెంట్‌ను అరికట్టడానికి ప్రస్తుత చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నొక్కిచెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..