స్ట్రీట్ డాగ్స్ కు ఆహారం పెడుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన కారు.. సీన్ కట్ చేస్తే..

|

Jan 17, 2023 | 7:25 AM

వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం ఆ తల్లీకూతుళ్ల అలవాటు. మూగజీవాలపై ఉండే ప్రేమలో వారు తమకు తోచిన విధంగా వాటి ఆకలి తీరుస్తున్నారు. కానీ మంచి మాటున ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. రోజూ...

స్ట్రీట్ డాగ్స్ కు ఆహారం పెడుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన కారు.. సీన్ కట్ చేస్తే..
Accident
Follow us on

వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం ఆ తల్లీకూతుళ్ల అలవాటు. మూగజీవాలపై ఉండే ప్రేమలో వారు తమకు తోచిన విధంగా వాటి ఆకలి తీరుస్తున్నారు. కానీ మంచి మాటున ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. రోజూ వారీ లాగే శునకాలకు ఆహారం అందిస్తున్న సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. కూతురిని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటన ఛండీగడ్ లో జరిగింది. ఛండీగడ్ లోని సెక్టార్ 53 లో తేజశ్విత అనే 25 ఏళ్ల యువతి.. వీధి కుక్కలకు ఆహారం అందిస్తోంది. ఆమెతో పాటు తల్లి మంజిందర్​ కూడా ఉన్నారు. వీధి కుక్కల ఆకలి తీర్చడం వారికి అలవాటు. ఈ క్రమంలో శనివారం కూడా శునకాలకు ఆహారం అందించేందుకు తల్లికూతుళ్లు వెళ్లారు. కుక్కలకు ఆహారం పెడుతున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చింది. తేజశ్వితను ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా ప్రమాదం చేసి దూసుకెళ్లింది.

దీనిని గమనించిన తల్లి వెంటనే అలర్ట్ అయ్యి.. వాహనదారులను సహాయం కోరింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం శోచనీయం. ఇక చేసేదేమీ లేక పోలీసులు, భర్తకు ఫోన్ చేసి సమాచారం అందించింది. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన తేజశ్వితకు చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేజశ్విత ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కానీ పోలీసులు ఇప్పటికీ నిందితుడు గుర్తించలేదని ఆరోపించారు. త్వరగా నిందితును పట్టుకోవాలని వారు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..