Amarnath Yatra: మూడేళ్ల తర్వాత పునఃప్రారంభం.. అమర్నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తజనం

|

Jun 30, 2022 | 5:11 PM

ప్రముఖ ఆధ్యాత్మిక అమర్ నాథ్ (Amaranath) యాత్ర నేటి నుంచి జమ్ముకశ్మీర్​లోయలో ప్రారంభమైంది. నున్నవాన్​బేస్​క్యాంప్​నుంచి 2,750 మంది యాత్రికులు ఇష్ట దైవాన్ని సందర్శించుకునేందుకు పయనమయ్యారు. లెఫ్టినెంట్‌ జమ్ముకశ్మీర్​గవర్నర్ మనోజ్​సిన్హా...

Amarnath Yatra: మూడేళ్ల తర్వాత పునఃప్రారంభం.. అమర్నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తజనం
Amarnath Yatra
Follow us on

ప్రముఖ ఆధ్యాత్మిక అమర్ నాథ్ (Amaranath) యాత్ర నేటి నుంచి జమ్ముకశ్మీర్​లోయలో ప్రారంభమైంది. నున్నవాన్​బేస్​క్యాంప్​నుంచి 2,750 మంది యాత్రికులు ఇష్ట దైవాన్ని సందర్శించుకునేందుకు పయనమయ్యారు. లెఫ్టినెంట్‌ జమ్ముకశ్మీర్​గవర్నర్ మనోజ్​సిన్హా వర్చువల్​గా మంచు లింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. బేస్ క్యాంప్ నుంచి అమర్​నాథ్ క్షేత్రానికి చేరుకునేందుకు మూడు రోజుల (Jammu-Kashmir) సమయం పడుతుంది. కాగా ఇవాల్టి నుంచి ప్రారంభమైన యాత్ర 43 రోజులపాటు కొనసాగి, ఆగస్టు 11న ముగియనుంది. కాగా.. కరోనా కారణంగా మూడేళ్లుగా భక్తులకు యాత్రకు అనుమతి ఇవ్వలేదు. దీంతో మూడేళ్ల తర్వాత మళ్లీ అనుమతించడం వల్ల భారీగా యాత్రికులు తరలివచ్చారు. యాత్రలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించేందుకు 70 పడకల ఆస్పత్రిని బల్తాల్‌ బేస్‌ క్యాంపు వద్ద ఏర్పాటు చేశారు. బల్తాల్‌ చాందన్వారీ మార్గాల్లో 135 అంబులెన్సులను సిద్ధం చేశారు. స్వచ్ఛ అమర్‌నాథ్‌ యాత్ర లక్ష్యంగా పరిశుభ్రతపై దృష్టి సారిస్తామని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా వెల్లడించారు.

ఆర్టికల్‌ 370 రద్దుతో 2019లో అమర్‌నాథ్‌ యాత్ర మధ్యలోనే రద్దయ్యింది. తర్వాత కరోనా వ్యాప్తి పెరగడంతో 2020, 2021ల్లోనూ యాత్ర చేపట్టలేదు. ప్రస్తుతం కొవిడ్‌ నియంత్రణలో ఉండడంతో ఈ యాత్రను యథావిధిగా కొనసాగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మూడేళ్ల విరామం తర్వాత యాత్ర మొదలు కానుండడంతో భక్తుల సంఖ్య భారీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలాఉంటే, దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో దాదాపు 3880 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో ఉన్న అమర్‌నాథుడి దర్శనం కోసం దేశవ్యాప్తంగా ఏటా భారీ ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. మొత్తం 43 రోజుల పాటు ఈ యాత్ర జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..