AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Terrorists: భారత్‌లో అల్‌ఖైదా కుట్ర భగ్నం… నలుగురు అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్‌

దేశంలో టెర్రర్‌ యాక్టివిటీస్‌ కలకలం రేపుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ అల్-ఖైదా ఉగ్రవాదులు పట్టుబడటం సంచలనం రేకెత్తిస్తోంది. భారీ ఉగ్రకుట్రను భద్రత బలగాలు భగ్నం చేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‍-ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న నలుగురు తీవ్రవాదులను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు...

Terrorists: భారత్‌లో అల్‌ఖైదా కుట్ర భగ్నం... నలుగురు అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్‌
Terrorists Arrest
K Sammaiah
|

Updated on: Jul 24, 2025 | 7:28 AM

Share

దేశంలో టెర్రర్‌ యాక్టివిటీస్‌ కలకలం రేపుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ అల్-ఖైదా ఉగ్రవాదులు పట్టుబడటం సంచలనం రేకెత్తిస్తోంది. భారీ ఉగ్రకుట్రను భద్రత బలగాలు భగ్నం చేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‍-ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న నలుగురు తీవ్రవాదులను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. ఢిల్లీ, నోయిడా, అహ్మదాబాద్, మోడాసాలో ఈ ఆపరేషన్‌ నిర్వహించి ఉగ్రవాదులను పట్టుకున్నారు. అరెస్టైన వారిని మొహమ్మద్ ఫైక్, మొహమ్మద్ ఫర్దీన్, సైఫుల్లా ఖురేషీ, జీషాన్ అలీగా గుర్తించారు. ఈ ఉగ్రవాదులు భారత్‌లో ప్రముఖ స్థలాలపై దాడులు చేయడానికి పన్నాగం పన్నినట్లు అధికారులు తెలిపారు.

నకిలీ కరెన్సీ వ్యాపారం నిర్వహించే ఈ నలుగురూ అల్‍-ఖైదా ఉగ్ర సిద్ధాంతాలను ప్రచారం చేయడం కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. ఈ సోషల్ మీడియా వేదికలు, ఆటో-డిలీట్ ఫీచర్ ఉండే అనుమానాస్పద యాప్‌లు ఉపయోగించి తమ సంభాషణలు సాగిస్తూ అల్‍-ఖైదా సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు. చాలా కాలంగా వీరికి ఈ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ నలుగురు గుజరాత్‌లో ఉగ్రచర్యలపై చర్చలు జరుపుతున్న సమయంలో గుర్తించినట్టు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అనుమానాస్పద చాటింగ్ సమాచారం, సోషల్ మీడియా ఖాతాలను విశ్లేషిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే పార్లమెంట్ వర్షకాల సమావేశాల వేళ.. డేంజరస్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా టెర్రరిస్టులు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఉగ్రవాదులు దేశంలో ఏమైనా దాడులకు కుట్ర పన్నారా అన్న కోణంలో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎప్పటి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు..? గతంలో జరిగిన ఏవైనా దాడుల్లో వీరికి హస్తం ఉందా అన్న కోణంలో కూపీ లాగుతున్నారు.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..