Corona Cases India: దేశంలో కొనసాగుతున్న కరోనా తీవ్రత.. కొత్తగా 16,946 పాజిటివ్ కేసులు, 198 మరణాలు..

Corona Cases India: దేశంలో ఒకవైపు కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుండగా.. మరోవైపు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య...

Corona Cases India: దేశంలో కొనసాగుతున్న కరోనా తీవ్రత.. కొత్తగా 16,946 పాజిటివ్ కేసులు, 198 మరణాలు..
Follow us

|

Updated on: Jan 14, 2021 | 11:31 AM

Corona Cases India: దేశంలో ఒకవైపు కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుండగా.. మరోవైపు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,946 మందికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనితో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,05,12,093కి చేరింది.

నిన్న కొత్తగా 17,652 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 1,01,46,763 కోలుకున్నారు. కాగా, బుధవారం ఒక్కరోజే 198 మంది కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,51,727కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,13,603 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.