Kashmir: కథనసీమలో కొదమ సింహాల్లా భారత సేనలు.. 2022లో కశ్మీర్‌లో 100 మంది ముష్కరులు హతం

|

Jun 13, 2022 | 3:20 PM

కశ్మీర్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు భారత సేనలు హతమార్చిన 100 మంది ఉగ్రవాదుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ -లష్కరే తోయిబాకు చెందిన 63 మంది ఉన్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.

Kashmir: కథనసీమలో కొదమ సింహాల్లా భారత సేనలు.. 2022లో కశ్మీర్‌లో 100 మంది ముష్కరులు హతం
Kashmir
Follow us on

Kashmir Security: భద్రతాపరంగా అత్యంత సమస్యాత్మకమైన కశ్మీర్‌లో భారత సేనలు కొదమ సింహాల్లా గర్జిస్తున్నాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను చావుదెబ్బతీస్తున్నాయి. ఈ ఏడాది(2022) ప్రారంభం నుంచి ఇప్పటివరకు కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన సైనిక ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులను భారత సేనలు హతమార్చాయి. వీరిలో 29 మంది విదేశీ ముష్కరులు ఉన్నట్లు భారత భద్రతా అధికారులు తెలిపాయి.

భారీ సంఖ్యలో తమ వాళ్లను కోల్పోయి నిషేధిత ఉగ్రవాద సంస్థ – లష్కరో తోయిబాకు చావు దెబ్బ తగిలింది. కశ్మీర్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు భారత సేనలు హతమార్చిన 100 మంది ఉగ్రవాదుల్లో లష్కరే తోయిబాకు చెందిన 63 మంది ఉన్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. హతమైన మరో 24 మంది ఉగ్రవాదులకు జైషే మహ్మద్ (జేఈఎం)తో సంబంధాలు ఉన్నారని వారు తెలిపారు.

రెట్టింపు స్థాయిలో ఉగ్రవాదుల ఏరివేత..

ఇవి కూడా చదవండి

కశ్మీర్‌లో మునుపటితో పోల్చితే మరింత చురుగ్గా ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని భద్రతా బలగాలు కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి 29 మంది విదేశీయులు సహా 100 మంది ఉగ్రవాదులను కశ్మీర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి గత ఏడాది ఇదే కాలంలో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య కంటే ఇది రెట్టింపుగా వారు చెప్పారు. గత సంవత్సరం మొదటి ఐదు నెలల 12 రోజుల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో ఒక విదేశీయుడితో సహా 50 మంది ఉగ్రవాదులు మరణించారని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..