ముగిసిన ముఖేష్‌గౌడ్ అంత్యక్రియలు

కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ అంత్యక్రియలు ముగిశాయి. సాయంత్రం 3.00 గంటలకు షేక్‌పేట గౌడసమాజ్‌లో అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో ముఖేష్ గౌడ్ అభిమానులు, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ముఖేష్‌గౌడ్ 7 నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతూ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ముఖేష్‌గౌడ్ 1959 జులై 1న జన్మించారు. ముఖేష్‌గౌడ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముఖేష్‌గౌడ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ముఖేష్‌గౌడ్‌ కుటుంబ […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:20 pm, Tue, 30 July 19

కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ అంత్యక్రియలు ముగిశాయి. సాయంత్రం 3.00 గంటలకు షేక్‌పేట గౌడసమాజ్‌లో అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో ముఖేష్ గౌడ్ అభిమానులు, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

ముఖేష్‌గౌడ్ 7 నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతూ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ముఖేష్‌గౌడ్ 1959 జులై 1న జన్మించారు. ముఖేష్‌గౌడ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముఖేష్‌గౌడ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ముఖేష్‌గౌడ్‌ కుటుంబ సభ్యుల్ని కాంగ్రెస్ నేత ఆజాద్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‌, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మధుయాష్కీ, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు పరామర్శించారు.