Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds)లో పెట్టుబడి మార్కెట్(Stock Market) రిస్క్‌కు లోబడి ఉంటుందని తెలిసిందే. అయితే పెట్టుబడిదారుడు ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే, మ్యూచువల్ ఫండ్స్‌ల్లో రాబడి గరిష్టంగా ఉన్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కవ కాలం పెట్టుబడి పెట్టడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే ఇదంతా ఓ క్రమపద్ధతిలో సాగినప్పుడే సాధ్యమవుతుందని గుర్తుంచుకోవాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు పెట్టుబడిదారుడు గుర్తుంచుకోవలసిన నియమాలు ఎన్నో ఉన్నాయి. ఈ నియమాలు పాటించి, లాంగ్ టర్మ్‌లో అధిక లాభాన్ని పొందవచ్చు. ఇందులో ముఖ్యమైనది 15 X 15 X 15 రూల్. అసలు ఈ రూల్ ఏంటి. అది ఎలా పనిచేస్తుంది. దీని వల్ల ఉపయోగాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు 15 X 15 X 15 రూలంటే ఏంటి?
15 X 15 X 15 మ్యూచువల్ ఫండ్ SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) నియమం ప్రకారం, పెట్టుబడిదారుడు నెలకు రూ.15,000 చొప్పున 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే, ఒక కోటి మెచ్యూరిటీ మొత్తాన్ని పొందవచ్చని ఆశించవచ్చు. అంటే అప్పుడు రాబడి దాదాపు 15 శాతంగా లెక్కించినప్పుడు మీరు పెట్టిన పెట్టబడి మొత్తం ఒక కోటిగా మారుతుంది. పెట్టుబడిదారుడు తన రిస్క్‌ను బట్టి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లేదా లార్జ్ క్యాప్ ఫండ్‌ని ఎంచుకోవచ్చు.
ఈ నియమం ఎలా పని చేస్తుంది ?
15 సంవత్సరాల పాటు 15,000 నెలవారీ SIPపై 15 శాతం వార్షిక రాబడిని సంపాదించడం ద్వారా రూ. 1 కోటి కంటే ఎక్కువ కార్పస్‌ను సృష్టించవచ్చని ఈ నియమం చెబుతోంది.
మీరు 15 శాతం వార్షిక రాబడితో వెళ్తే దాదాపు మీరు రూ. 27,00,000 పెట్టుబడి పెడతారు. ఈ మొత్తం మీద ఆశించిన మొత్తం రాబడి రూ. 74,52,946 అవుతుంది. 15 సంవత్సరాల కాలానికి ఫలితంగా కార్పస్ సుమారుగా రూ. 1,01,52,946 ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మ్యూచువల్ ఫండ్ SIP పథకాలు 15 X 15 X 15 నియమానికి ఉత్తమమైనవి:
స్మాల్-క్యాప్ ఫండ్: SBI స్మాల్ క్యాప్ ఫండ్ – రెగ్యులర్ గ్రోత్; CAGR – 66 శాతం.
మిడ్-క్యాప్ ఫండ్స్: ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మిడ్ ఫండ్ – ప్లాన్ – గ్రోత్ రెగ్యులర్ ప్లాన్; CAGR – 26 శాతం.
లార్జ్-క్యాప్ ఫండ్: HDFC టాప్ 100 ఫండ్ – రెగ్యులర్ ప్లాన్ – గ్రోత్; CAGR – 38 శాతం.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ప్రమాదానికి లోబడి ఉంటాయి. అన్ని స్కీమ్ డాక్యుమెంట్‌లను జాగ్రత్తగా చదవండి. మ్యూచువల్ ఫండ్ గత పనితీరు తప్పనిసరిగా పథకాల భవిష్యత్తు పనితీరును ప్రతిబింబించకపోవచ్చు. పెట్టుబడికి సంబంధించిన ఆర్థికపరమైన సలహాలకు నిపుణులను సంప్రదించి వారి సలహాలను తీసుకోవాలి.
Budget 2022: ఆర్థిక మంత్రి వైపే మహిళల చూపులు.. బడ్జెట్ 2022లో ఎలాంటి వరాలు ఇవ్వనున్నారంటే?