సూపర్ స్టార్.. ‘ సరిలేరు నీకెవ్వరూ ‘.. బ్లాక్ బస్టర్ అవుతుందా ?

, సూపర్ స్టార్.. ‘ సరిలేరు నీకెవ్వరూ ‘.. బ్లాక్ బస్టర్ అవుతుందా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ఇటీవలే ఫారిన్ లో టూర్ చేయడమే గాక.. .. లండన్లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ చూసి ఎంజాయ్ చేశాడు. ఆ సందర్భంగా తన కొడుకుతో దిగిన ఫోటోను షేర్ చేశాడు కూడా . ఇక సమ్మర్ హాలిడే స్ ఎంజాయ్ మెంట్ కి స్వస్తి చెప్పి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్న ఈ ‘ మహర్షి ‘.. తన తాజా చిత్రం ‘ సరిలేరు నీకెవ్వరూ ‘ షూటింగ్ పై ఫోకస్ పెట్టాడు. ‘ ఎఫ్ 2 ‘ బ్లాక్ బస్టర్ మూవీతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు అప్పుడే మొదలయ్యాయి. వచ్ఛే జులై మొదటివారం నుంచి సెట్స్ మీదికి వెళ్ళనున్న ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్ టైనర్.. ఇందులో సోల్జర్ గా నటిస్తున్నమహేష్ బాబు తన రోల్ కోసం మైనర్ మేకోవర్ చేయించుకున్నాడట.. అందాల రాశి రష్మిక మందన్న తన సోయగాలతో ఈ మూవీలో మహేష్ సరసన నటించడమే గాక.. ఆడి..పాడనుంది. టైటిల్ తోనే ఈ చిత్రం మహేష్ ఫాన్స్ ని ఆకట్టుకుంది.

, సూపర్ స్టార్.. ‘ సరిలేరు నీకెవ్వరూ ‘.. బ్లాక్ బస్టర్ అవుతుందా ?

ఇక.. ‘ రాములమ్మ ‘ విజయశాంతి 17 ఏళ్ళ తరువాత మళ్ళీ ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తోంది. ఇందులో ఈమె కీలక రోల్ లో నటిస్తోంది. రాజకీయాలకు కొంత విరామమిచ్చి..తిరిగి ముఖానికి రంగేసుకోవడం థ్రిల్లింగ్ గా ఉందని విజయశాంతి  ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో పేర్కొంది కూడా. అయితే మేకర్స్ ఈ ఫిల్మ్ లో ఈమె పాత్ర ఏమిటన్నది సస్పెన్స్ లో ఉంచారు. ఇక వచ్ఛే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న మహేష్ సినిమా ‘ సరిలేరు నీకెవ్వరూ ‘ బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని అప్పుడే వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి-మహేష్ కాంబో అంటే భారీ అంచనాలు ఉండవంటే ఉండవూ మరి ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *