Lifestyle: సడన్‌గా మద్యం మానేస్తే ఏమవుతుందో తెలుసా.?

|

Nov 19, 2024 | 10:42 AM

ఆల్కహాల్‌ అలవాటు ఉన్న వారు ఏదో రోజు కచ్చితంగా మానేస్తామని చెబుతుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆల్కహాల్‌ అలవాటును ఉన్నపలంగా మానేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మద్యాన్ని ఒక్కసారిగా మానేస్తే జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: సడన్‌గా మద్యం మానేస్తే ఏమవుతుందో తెలుసా.?
Stop Alcohol
Follow us on

మద్యం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా మందుబాబులు మాత్రం ఆ అలవాటును మానుకోవడానికి ఇష్టపడరు. ఇదే చివరి రోజంటూ రోజూ లాగించేస్తుంటారు. అయితే ఇటీవల ఆరోగ్యంపై పెరుగుతోన్న అవగాహన నేపథ్యంలో చాలా మంది మద్యం అలవాటును మానుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగా కొందరు మానసిక నిపుణులు సలహాలు సైతం తీసుకుంటున్నారు.

అయితే మద్యం తీసుకోవడం ఎంత ప్రమాదకరమే ఉన్నపలంగా మానేయడం కూడా అంతే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారిగా మద్యం తాగే అలవాటును మానేస్తే శరీరంలో ఎన్నో సమస్యలకు దారి తీస్తాయని అంటున్నారు. మద్యం అలవాటు ఉన్న వారు ఒక్కసారిగా మానేయడం వల్ల విత్ డ్రాయల్ సిండ్రోమ్‌ అనే సమస్య బారిన పడుతారని వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరంపై ప్రభావం పడుతంఉదని అంటున్నారు.

అందుకే మద్యం మానేయాలనుకునే వారు రోజురోజు కొంచెం కొంచెం తగ్గిస్తూ క్రమంగా మద్యాన్ని మానేయాలని సూచిస్తున్నారు. ఉన్నపలంగా మద్యం మానేయడం వల్ల కొందరిలో టెన్షన్‌, అలసట వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యంపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెద్ద పెద్ద శబ్ధాలు వింటున్నట్లు, ఎవరో పిలిచినట్లు భ్రమ కలుగుతుంది. చిన్న చిన్న విషయాలకే ఎమోషన్‌ అవుతారు. భయపడుతుంటారు.

ఇక మద్యం ఉన్నపలంగా మానేయడం వల్ల న్యూరోలాజికల్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా మతిమరుపు వస్తుంది. శరీరంలో కంట్రోల్‌ కోల్పోతుంది. కండరాలు బలహీనంగా మారుతాయి. తాము ఏం ఆలోచిస్తున్నామన్న విషయాన్ని కూడా కోల్పోతారు. ఎదుటి వారితో చిటికిమాటికి గొడవలు పడతారు. అందుకే మద్యం మానేయాలనే ఆలోచన ఉన్న వారు క్రమంగా తగ్గిస్తూ.. ఇతర వ్యాపకాలను అలవాటు చేసుకోవడంతో పాటు, మంచి ఆరోగ్యాన్ని డైట్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..