AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యూజిక్‌ కేవలం బీట్‌ కాదు బ్రో.. అది మన హృదయాన్ని నేరుగా తాకే వైబ్‌! రోజూ కాసేపు వినండి

సంగీతం వినడం మనసుకు సంతృప్తినిస్తుంది. అందుకే చాలా మంది సంతోషంగా ఉన్నప్పుడు లేదా విసుగుగా ఉన్నప్పుడు సంగీతం వింటూ ఉంటారు. కొందరు ప్రతిరోజూ కూడా సంగీతం వింటారు. ఈ విధంగా, ఆనందం, వినోదం కోసం సంగీతం వినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట. సంగీతం వినడం మనకు వినోదాన్ని అందించడమే కాకుండా ఒత్తిడిని తగ్గించి మనసును తేలికపరుస్తుంది. కాబట్టి సంగీతం వినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

మ్యూజిక్‌ కేవలం బీట్‌ కాదు బ్రో.. అది మన హృదయాన్ని నేరుగా తాకే వైబ్‌! రోజూ కాసేపు వినండి
Habit To Listen To Music Every Day
Srilakshmi C
|

Updated on: May 05, 2026 | 8:27 PM

Share

మ్యూజిక్‌ వినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనం పాటలు విన్నప్పుడు మెదడు ‘ఆనందాన్నిచ్చే’ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. సంగీతం మన హార్మోన్లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఇష్టమైన సంగీతాన్ని విన్నప్పుడు, మీ శరీరంలోని కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉంటారు.

మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది

మీకు రాత్రిపూట నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే పడుకునే ముందు మంచి మ్యూజిక్‌ వినడం ప్రయోజనకరంగా ఉంటుంది. పాటలు మీ మనసును ప్రశాంతపరిచి, శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. దీనివల్ల మీరు బాగా నిద్రపోతారు. ప్రతిరోజూ పాటలు వినడం వల్ల మీ నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

ఏకాగ్రత – దృష్టిని పెంచుతుంది

పాటలు ఏకాగ్రతను మరియు దృష్టిని పెంచుతాయి. చదువుకునేటప్పుడు లేదా పని చేసేటప్పుడు ప్రశాంతమైన, మృదువైన సంగీతం వినడం వల్ల పరధ్యానాలు తగ్గి, చేస్తున్న పనిపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. అందుకే చాలా మంది పని చేసేటప్పుడు సంగీతం వింటారు.

విసుగును పోగొడుతుంది

మీకు విసుగుగా లేదా అలసటగా అనిపిస్తే మీకు ఇష్టమైన పాటలు వినండి. అది తక్షణమే మీ మానసిక స్థితిని మార్చగలదు. సంగీతం మీ భావోద్వేగాలను వ్యక్తపరచడానికి, సానుకూల ఆలోచనలను పెంపొందించడానికి సహాయపడుతుంది. దీనివల్ల ప్రతికూల ఆలోచనలు మనసులోకి రాకుండా నివారించవచ్చు.

గుండె ఆరోగ్యానికి మంచిది

సంగీతం వినడం గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ప్రశాంతమైన సంగీతం రక్తపోటును నియంత్రించడంలో, గుండె స్పందన రేటును స్థిరీకరించడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండెపై భారం తగ్గి, మొత్తం గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని నిమిషాల పాటు సంగీతం వినడం వల్ల మానసిక విశ్రాంతి లభించి, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్ ఇలా..
హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్ ఇలా..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!
కూలర్‌ను ఏసీగా మార్చుకోండిలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
కూలర్‌ను ఏసీగా మార్చుకోండిలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
ఎంత కోపం వచ్చినా.. స్త్రీలు అస్సలే చేయకూడని పనులు ఇవే!
ఎంత కోపం వచ్చినా.. స్త్రీలు అస్సలే చేయకూడని పనులు ఇవే!